NewsOrbit
న్యూస్

మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా రగిలిపోతున్నారట !

నరసాపురం వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు బయటపడ్డాడు గాని మరికొందరు ఆ పార్టీ ఎంపీలు కూడా లోలోపల తమకు పార్టీలో ప్రాధాన్యం లేదని ఫీలవుతున్నట్లు లీకులు వస్తున్నాయి .

 

 

తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు పార్ల మెంటు స‌భ్యుడు ఆదాల పభాకర్‌రెడ్డిలు ఇద్దరూ కూడా తీవ్ర అసంతృప్తితో ర‌గిలి పోతున్నార‌నే ప్రచారంసాగుతోంది. త‌మ‌కు జిల్లాలో ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని, త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా వారు ఫీల‌వుతున్నారట..సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌దామంటే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వని ప‌రిస్థితిలో వారుత‌మ‌లో తామే కుమిలిపోతున్నారని ప‌రిశీల‌కులు చెబుతున్నారు


ఇటు, ప్రకాశంలోను, అటు నెల్లూరులోనూ రెడ్డి సామాజిక వ‌ర్గం హవా ఎక్కువ‌గా న‌డుస్తోంది.ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, నెల్లూరులో మేక‌పాటి గౌతంరెడ్డి వంటి కీల‌క నేత‌లు చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో త‌మ‌కు కూడా ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని, ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ప్రభాక‌ర్‌రెడ్డిలు భావించారు. కానీ, అది జరగడం లేదు .ఇటు ఆదాల ,అటు మాగుంట మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరారు. ఆవెంట‌నే గెలిచారు. అయితే వారికి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయ‌కుల‌కు మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌లేదు. దీంతో వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.



ప్రకాశం జిల్లాలో జిల్లాలో మంత్రులు అయిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఆదిమూల‌పు సురేష్ హ‌వా ఎక్కువ‌గా ఉండ‌డం.. దిగువ శ్రేణి నాయ‌కులు కూడా మంత్రుల క‌నుస‌న్నల్లోనే నడుస్తుండ‌డంతో మాగుంట ప‌రిస్థితి డోలాయ‌మానంగా మారింది. ఓ ఎంపీగా ఉండి చిన్నప‌ని కూడా చేయించుకునే ప‌రిస్థితి లేద‌ట‌. ఒక వేళ తాను ఏదైనా చిన్న ప‌ని చేయించుకోవాల‌న్నా మంత్రులో లేదా, ఎమ్మెల్యేల‌నో అడ‌గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోతున్నార‌ట‌. ఇక‌, ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి ప‌రిస్తితి కూడా డిటో ఇలానే ఉంద‌ని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఈయ‌న కూడా త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు.




దీంతో ఈ ఇద్దరు ఎంపీలు మాన‌సికంగా న‌లిగిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పటికైనా సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకుంటేనే ప‌రిస్థితి బెట‌ర్ అవుతుంద‌ని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులంద‌రూ ఎంపీల‌ను క‌లుపుకొని పోయేలా వారికి కూడా ప్రాధాన్యం ద‌క్కేలా ఆదేశాలు ఇస్తే.. స‌మ‌స్యలు లేకుండా పోతాయ‌ని అంటున్నారు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు తెచ్చిన తలనొప్పి తోనైనా జగన్ గుణపాఠం నేర్చుకుని పార్టీ ఎంపీలందరికీ పెద్దపీట వేయడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకు సూచిస్తున్నారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju