NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ambati Rayudu: వైసీపీకి ప్రముఖ క్రికెటర్ అంబటి బిగ్ ట్విస్ట్..అకస్మాత్తుగా యూటర్న్

Ambati Rayudu: ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న అంబటి రాయుడు ఇవేళ కీలక ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యచరణ ప్రకటిస్తా అని తెలిపారు. గత నెల 28వ తేదీనే ఆయన సీఎం వైఎస్ జగన సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

cricketer Ambati Rayudu met ap cm ys jagan mohan reddy

పార్టీలో చేరిన పది రోజుల వ్యవధిలోనే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. గత కొంత కాలంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ, వైసీపీకి దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చిన అంబటి తిరుపతి రాయుడు  అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో గుంటూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు. వైసీపీలో చేరిన రోజున .. అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ .. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

Ambati Rayudu

మొదటి నుండి తనకు జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని..ఆయన కులమతాలు, రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు తెలిపారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారనీ..ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని రాయుడు ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

ఇలా  తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన అంబటి రాయుడు నేడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తొలుత గుంటూరు లోక్ సభ స్థానంపై అంబటి రాయుడికి హామీ ఇచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానం నుండి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాలని జగన్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే లావు తాను నరసరావుపేట నుండి అయితే పోటీ చేస్తానని, గుంటూరు నుండి అయితే పోటీ చేయనని చెప్పినట్లుగా తెలుస్తొంది. నరసరావుపేట లోక్ సభ స్థానం ఈ సారి బీసీ నేతకు ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు లోక్ సభ స్థానం పోటీ చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.

రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పిన అంబటి రాయుడు ఆకస్మికంగా యూటర్న్ తీసుకోవడంపై రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. అంబటి రాయుడు పార్టీ కండువా కప్పుకున్న తర్వాత గుంటూరు  నియోజకవర్గంలో పర్యటించలేదు. పార్టీలో చేరిన రోజునే హైదరాబాద్ వెళ్లిపోయారు. పది రోజులుగా అక్కడే ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వేళ ట్విట్టర్ వేదికగా కీలక నిర్ణయాన్ని వెలువరించారు. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Kesineni Nani: కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని .. బాబుకు బిగ్ ఝలక్

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju