ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతాంగానికి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల లో ఏపికార్ల్ వద్ద న్యూటక్ బయోసైన్సెస్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజుల్లో పకృతి వ్యవసాయమే శ్రేయస్కరమని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు ప్రోత్సహం అందిస్తుందని చెప్పారు. రసాయనాలతో కూడిన ఆహారం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయన్నారు.
ప్రస్తుతం ఏపిలో ఆరు లక్షల మంది రైతులు పకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామస్థాయిలో శిక్షణలు ఏర్పాటు చేసి పకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలని సూచించారు. పకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని చెప్పారు. విత్తు నుండి విక్రయం వరకూ రైతులకు ఆర్ బీ కే లు అండగా నిలుస్తున్నాయన్నారు. అంతకు ముందు పులివెందుల, వేంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం జగన్ స్థానిక నాయకులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఇడుపులపాయిలోని వైఎస్ఆర్ ఎస్టేట్ కు సీఎం జగన్ చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ నుండి హెలికాఫ్టర్ లో కడప ఎయిర్ పోర్టుకు కు 9.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి 9.20 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 10.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్లీనరీ వేదిక వద్దకు చేరుకుంటారు. రేపు, ఎల్లుండి ప్లీనరీ వద్దనే సీఎం జగన్ ఉండనున్నారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…