NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees PRC: మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి… సమస్య పరిష్కార ధిశగా అడుగులు..

AP Employees PRC: పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల సమ్మె తేదీ దగ్గర పడుతుందటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. తొలుత మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ జరిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. శుక్రవారం రాత్రి దాదాపు అయిదు గంటల పాటు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చించింది. పలు డిమాండ్ల పై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

AP Employees PRC issue meeting
AP Employees PRC issue meeting

Read More: AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP Employees PRC: పలు అంశాల్లో సవరణలకు ప్రభుత్వం సుముఖత

మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ లు స్టీరింగ్ కమిటీ తరపున పాల్గొన్న 20 మంది ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించారు. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులకు మంత్రులు అంగీకారం తెలిపారు. దీంతో పాటు అదనపు క్వాంటమ్ ఫించను, తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు సంసిగ్ధత వ్యక్తం చేశారు.

హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు

హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు 8 శాతం, 12 శాతం, 16 శాతం, 24 శాతం ఇచ్చేందుకు మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. సీపీఎస్ రద్దు పై మరో మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోందని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపింది. మరో ఉప సంఘం చర్చలు దృష్ట్యా సమయం కావాలని కోరింది. ప్రభుత్వం సూచించిన అంశాలపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించిన తరువాత మంత్రుల కమిటీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. హెచ్ఆర్ఏ శ్లాబ్ లు పాతవే కొనసాగించాలనీ, 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, ఓట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస టైమ్ స్కేల్, గ్రామ సచివాలయ సిబ్బందికి 2022 పిఆర్సీ స్కేల్ ఇవ్వాలని, మార్చి 31 లోగా సీపీఎస్ రద్దు పై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని మంత్రుల కమిటీకి వెల్లడించారు.

కాగా శనివారం (నేడు) మధ్యాహ్నం 2 గంటలకు మరో సారి సమావేశం జరిపేందుకు నిర్ణయించింది మంత్రుల కమిటీ. అయితే కొన్ని అంశాలల్లో ఏకాభిప్రాయం కుదిరిందనీ, మరి కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ, చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయనీ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండానే ప్రభుత్వం తమ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని సంఘ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?