NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

YS Jagan: సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుంది అని చెప్పవచ్చు. జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి నవరత్న పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. వివిధ పథకాల లబ్దిదారులకు బటన్ నొక్కి నేరుగా వారి ఖతాల్లో నిధులు జమ చేస్తున్నారు సీఎం జగన్. దీంతో అవినీతికి అస్కారం లేకుండా పోతుంది. లబ్దిదారులకు న్యాయం జరుగుతోంది.

అధికారం చేపట్టిన నాటి నుండి సీఎం జగన్ విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు మరింత ప్రయోజనం కలిగేలా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు సంబంధించి కీలక విషయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజినీ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ లో లేని జబ్బులకు పేద వర్గాలు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సి వస్తుంది. అందుకే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా కొన్ని వ్యాధులను ఆరోగ్య శ్రీ జాబితాలోకి తీసుకురావడం జరిగింది.

తాజాగా ఆరోగ్య శ్రీ కార్డుపై మరి కొన్ని వ్యాధులకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని పెంచినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీ పై వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. రూ.25 లక్షల వరకూ ఎలాంటి అపరేషన్ లు అయినా ఉచితంగా చేయించుకోవచ్చు. ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండటానికి వీల్లేదని అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18న పరిమితి పెంచిన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి చెప్పారు.

ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం సీ ఎం ప్రారంభించిన తర్వాత అర్హులందరికీ అందుబాటులోకి వస్తాయని మంత్రి రజిని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నామన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు డిజిటలైజ్ చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీని వల్ల గతంలో వైద్యం నిమిత్తం వచ్చిన రోగుల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని, ఏ వైద్యుడిని సంప్రదించినా అతని అనారోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకుని వైద్యం చేసే వీలు ఉంటుందని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ .. ఈ మూడింటికి సంబంధించిన డేటా ఒకే చోట ఉండేలా సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. త్వరలోనే జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి రజిని వెల్లడించారు.

Revanth Reddy: గ్యారేంటీని నిలబెట్టుకుంటున్న రేవంత్ .. ప్రమాణ స్వీకారం రోజే దివ్యాంగురాలి కుటుంబంలో వెలుగు నింపే ఉత్తర్వులు !

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju