NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: తగ్గేదిలే..! జగన్ మార్క్ కనబడాల్సిందే..!!

AP Govt: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాల చెల్లింపులే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో పక్క రాష్ట్రం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని వైసీపీ పార్లమెంట్ సభ్యులు కోరుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నా సీఎం జగన్ నవరత్న పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. కొన్ని ఇచ్చిన హామీలను విస్మరించినా కొన్ని ఇవ్వని హామీలను నెరవేర్చారు. తాజాగా జగన్మోహనరెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

AP Govt new desicion on grama sachivalam
AP Govt new desicion on grama sachivalam

AP Govt: ప్రొబేషన్ ఖరారు

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో లక్షా 20వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా గ్రామ సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన ప్రభుత్వం.. వారికి సంబంధించి ప్రొబేషన్ ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు ప్రభుత్వం నుండి రాగా జిల్లాల వారిగా ప్రొబేషన్ ఖరారు చేసే పని జరుగుతోంది. త్వరలోనే వీరంతా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.

ఒక్కో ఉద్యోగికి మూడు జతల యూనిఫామ్

గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులందరికీ యూనిఫామ్ తో పాటు 4జీ సిమ్ లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి యూనిఫామ్ లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత సీఎం జగన్ వారి యూనిఫామ్ కు సంబంధించిన కలర్ ఖరారు చేశారు. ఒక్కో ఉద్యోగికి మూడు జతల యూనిఫామ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా యూనిఫామ్ ల పంపిణీకి గానూ రెండు సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యువకులకు ప్యాంట్, షర్ట్, మహిళా ఉద్యోగులకు పంజాబీ డ్రైస్ పంపిణీ చేయనున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju