35.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు బిగ్ రిలీఫ్ .. జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశాలు

Share

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పయ్యావుల దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవేళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పయ్యావులకు భద్రత కల్పించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. ఫ్యాక్షన్ ప్రభావిత ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు భద్రతను తగ్గిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ధర్మాసనం ఇంతకు ముందు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Payyavula keshav

 

అయితే ఈ రోజు జరుగుతున్న విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. కేశవ్ కు వన్ ప్లస్ వన్ సెక్యురిటీ ఇవ్వాలని ఆదేశారు జారీ చేసింది. అయితే అయిదారుగురు సెక్యురిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్ ధర్మాసనం సూచించింది. అందులో ఇద్దరిని సెక్యురిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు భద్రత కల్పించిన వ్యక్తులపై పిటిషనర్ కు నమ్మకం ఉండాలి కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కేశవ్ కు తొలుత వన్ ప్లస్ వన్ సెక్యురిటీ కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇంతకు ముందు ఆయనకు టూ ప్లస్ టూ భద్రత ఉండగా, ప్రభుత్వం ఇటీవల తొలగించింది. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నందునే ఆయన భద్రతను తొలగించారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికలు వస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, మవోయిస్టుల నుండి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పయ్యావుల హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పయ్యావులకు భద్రత కల్పించాల్దిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో టూ ప్లస్ టూ భద్రతపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్


Share

Related posts

Buchibabu : ఉప్పెన బుచ్చిబాబు నెక్స్ట్ ఎంటీ..అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారా..?

GRK

సినిమా ప్రియుల కోసం మోడీ శుభవార్త చెప్పబోతున్నారు..!!

sekhar

అంత‌ర్జాతీయ స్థాయికి జ‌గ‌న్ రేంజ్‌… టీడీపీ వ‌ల్లే… ఇది టూ మ‌చ్ క‌దా?

sridhar