NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఆముదాలవలసలో రౌండ్ టేబుల్ సమావేశాలు .. నరసన్నపేటలో భారీ ర్యాలీ

వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొని ప్రసంగించారు. పాలనా వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసి ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యా వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందని చెప్పారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయని వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నారు. పిల్లల రేపటి భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ప్రజల ఈ పోరాటమని అన్నారు. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని తమ్మినేని విమర్శించారు.

tammineni sitaram

 

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు

నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, జేఏసి కన్వీనర్ లజపతిరాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఎన్టీఓలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని విజ్ఞఫ్తి చేశారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు.

Three Capitals Support Rally In narasannapeta

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju