దేశంలో ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంథన ధరల గురించి చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అసలే వేసవి కాలం కరెంటు వినియోగం కూడా పెరుగుతుంది. ఈ తరుణంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెరిగితే మరింత భారం అవుతుందని భయపడుతున్నారు. అయితే విద్యుత్ వినియోగదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2023 -24 ఆర్ధిక సంవత్సరానికి గానూ విద్యుత్ అదాయ, వ్యయాల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ ఆమోదించింది. విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి భారం లేకుండా ఈఆర్సీ నిర్ణయాలు తీసుకుంది.

2023 – 24 ఆర్ధి సంవత్సరానికి విద్యుత్ టాఫిక్ వివరాలను ఏపిఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ సంవత్సరం విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని ఆయన తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ, నాయి బ్రాహ్మణులు, అక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. మొత్తం రూ.10,135 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. చార్జీలు భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అయితే ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని ఆయన వెల్లడించారు.
ఏపి పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్న సీఎం జగన్