NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kavali (Nellore): ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Share

Kavali (Nellore): రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి .. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం, ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ముఠా పై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

దాడి ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే .. బెంగళూరు నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి రామ్ సింగ్ కావలి ట్రంక్ రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసి డ్రైవర్ తో వాగ్వివాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్ తో పాటు మరి కొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్ర వాహనాల్లో బస్సును వెంబడించి మద్దురుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రాంసింగ్ ను బస్సు నుండి కిందకు దించి విచక్షరాహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుండి పారిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు స్పందిస్తూ వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక దీనిని తీవ్రంగా ఖండించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాన నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలను నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ విజయవాడలో చికిత్స పొందుతుండగా ఈయూ నేతలు పరామర్శించారు. వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనను వైసీపీ ఎమ్మోల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులు అందరినీ అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.

Telangana Assembly Polls: చంద్రబాబు మరో యూటర్న్ .. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం.. నైరాశ్యంలో కాసాని..?


Share

Related posts

అమ్మ కరాటే కళ్యాణి, వైఎస్ జగన్ ను ఇన్నేసి మాటలు అంటున్నావ్!

sowmya

MP RRR Case: ఎంపి రఘురామకు 14 రోజులు రిమాండ్..! కానీ..?

somaraju sharma

Intinti Gruhalakshmi: ఎవరి వల్ల దివ్య జ్యూస్ తాగిందో తెలుసా..!? ఆనందంలో తులసి..!

bharani jella