NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking: ఏపి సర్కార్‌కు ఎన్జీటీ భారీ షాక్ …! పోలవరం ప్రాజెక్టుకు రూ.120 కోట్ల జరిమానా..!!

Big Breaking: ఏపి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120 కోట్ల జరిమానా విధించింది. అలాగే పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టినందుకు కూడా జరిమానా వేసింది ఎన్టీటీ. పురషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జనవరి 3వ తేదీలోపు జరిమానా చెల్లించాలని ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్ తో పాటు మరి కొందరు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఎన్జీటీలో కేసు విచారణ జరుగుతుంది.

Big Breaking: NGT imposes rs 120 crore fine on polavaram project
Big Breaking NGT imposes rs 120 crore fine on polavaram project

 

పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ అనుమతులు ఉల్లంఘిస్తున్నారని పర్యావరణ వేత్తలు ఎన్జీటీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై ఎన్జీటీ పలు కమిటీలను వేసింది. ఈ కమిటీల నివేదికల ఆధారంగా నేడు తుది తీర్పు ఇచ్చింది ఎన్జీటీ. ఇక పోలవరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అసలు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పర్యావరణ వేత్తలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇవి పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలు అని కావున  వీటికి ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీసీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీని నియమించాలని ట్రైబ్యునల్ పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju