Subscribe for notification

Breaking: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపి కేబినెట్ ఆమోదం

Share

Breaking:  ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తీవర సంచలనం అయిన కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet Meeting key Decisions

అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనపై నెల రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుండి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్న క్రమంలో జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను దగ్దం చేసి విధ్వంసాలను సృష్టించారు. ఆందోళనకు కారణమైన వంద మందికిపైగా యువకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం కూడా జరిగింది. అయితే జిల్లా పేరు మార్పు అంశంపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియడంతో ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

 

అదే విధంగా ఈ కేబినెట్ బేటీలో 27న అమలు చేయబోతున్న మూడవ విడత అమ్మ ఒడి పథకానికి ఆమోదం తెలిపింది. 15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహాక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై నెలలో అమలు చేయనున్న జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.


Share
somaraju sharma

Recent Posts

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

17 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

49 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

1 hour ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

3 hours ago