NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Special Status : హోదా లేదు.. రాదు.. ఇవ్వం : కేంద్ర మంత్రి స్పష్టం..!!

AP Special Status : తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఏపి, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఈ సామెతకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా అనేక హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. విభజన హామీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

central govt clarifies on AP Special Status
central govt clarifies on AP Special Status

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలుపడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రత్యేక హోదా సాధించకపోగా కేంద్రంలోని ఎన్ డీ ఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యేక హోదా అంటూ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. కాగా ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటూ బీజేపీ నేతలు చాలా సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర పెద్దలకు వినతి పత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపికి ప్రత్యేక హోదాపై టీడీపీ సభ్యుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టమైన జవాబు ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి వాటి పరిష్కారం తమ చేతుల్లో ఏమిలేదని తేల్చి చెప్పారు. ఆ సమస్యలు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju