NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

Manchu Mohanbabu Vishnu: తండ్రీ తనయుల షాకింగ్ కామెంట్స్..!!

Manchu Mohanbabu Vishnu: మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క మా సభ్యత్వాల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మరో పక్క అధ్యక్షుడుగా ఎన్నికైన మంచు విష్ణు. మంచు మోహన్ బాబులు షాకింగ్ కామెంట్స్ చేయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Manchu Mohanbabu Vishnu shocking comments
Manchu Mohanbabu Vishnu shocking comments

Read More: Huzurabad Bypoll: టీఆర్ఎస్ పప్పులు ఉడకలేదు..? ‘ఈటల’కు ఊరట..!!

Manchu Mohanbabu Vishnu: పోటీ నుండి చిరంజీవి డ్రాప్ అవ్వమన్నారు

మా ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రకాశ్ రాజ్ సోమవారం తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ రాజీనామాలపై అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాష్ రాజ్, నాగబాబు ల రాజీనామాలను ఆమోదించబోనని తెలిపారు. తమ కుటుంబంలో ఒకరైన నాగబాబు..మనసుకు కష్టం వల్లనో లేక ఆవేశం వల్లనో తీసుకున్న నిర్ణయమని, త్వరలో వారిద్దరిని కలిసి ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. మా ఎన్నికల్లో తనను పోటీ నుండి తప్పుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చిరంజీవి ఈ ప్రతిపాదన చేశారన్నారు. అయితే తన తండ్రి మోహన్ బాబు ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుపట్టడంతో పోటీలో నిల్చొని గెలిచానని విష్ణు స్పష్టం చేశారు.  మూడు నెలల్లో మా అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంచు విష్ణు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తానని తెలిపారు.

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు

మరో పక్క మంచు మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల విజయం అందరిదన్నారు. తనను మొదటి నుండి రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు. తానేమీ అసమర్ధుడిని కాదని, సింహం నాలుగు అడుగులు వెనకకు వేస్తే భయపడినట్లు కాదనీ, అది గురి చూసి పంజా విసురుతుందని అన్నారు. మనకు టైమ్ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలన్నారు. అన్ని నవ్వుతూనే స్వీకరించాలనీ, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మా ఎన్నికల గురించి మాట్లాడుకున్నారని అన్నారు. సమస్యలపై సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తేనే వారు స్పందిస్తారని అన్నారు. సీఎం కేసిఆర్ ను మనం సన్మానించామా అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తే వాళ్లు సాయం చేస్తారని అన్నారు. రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్ బంధువైన మోహన్ బాబు స్పందించి మాట్లాడవచ్చు కదా సూచించిన విషయం తెలిసిందే. ఆనాడు పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందిస్తూ ముందు మా ఎన్నికల్లో మంచు విష్ణు కు ఓట్లు వేసి గెలిపించండి, మా ఎన్నికల అనంతరం అన్నింటిపై మాట్లాడతానంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు మోహన్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందే అని అనుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri