NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: బాబుకు న్యాయదేవత కరుణకై భార్య ప్రార్థనాలయాల చుట్టూ ప్రదక్షిణలు

Nara Bhuvaneswari Praying On St.Paul's lutheran church rajamundry Over Chandrababu Arrest

Chandrababu Arrest: ఎవరికైనా కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకు వస్తారు. సుఖంగా సాగిపోయినంత కాలం భగవంతుడిని గురించి అంతగా పట్టించుకోరు. ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఇది ఎక్కువగా హిందువులు చేసే పని. అదే క్రైస్తవ మతస్థులు అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్ధనలో పాల్గొంటారు. ముస్లిం మతస్తులైతే ఎక్కువ శాతం నిత్యం మూడు సార్లు నమాజ్ చేస్తారు. వీలు కుదరని వారైతే వారానికి ఒక సారో రెండు సార్లు కఛ్చితంగా మసీదుకు వెళ్లి ప్రార్ధనలో పాల్గొంటారు. ఇలా హిందువుల్లో ఎక్కువ మంది నిత్యం ఆలయాలు వెళ్లే వారు చాలా తక్కువ మందే ఉంటారు.

Nara Bhuvaneswari Praying On St.Paul's lutheran church rajamundry Over Chandrababu Arrest
Nara Bhuvaneswari Praying On St.Paul’s lutheran church rajamundry Over Chandrababu Arrest

ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని కష్టమొచ్చిపడింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఇరుక్కున్నారు. ఈ కేసు నుండి బయట పడకముందే మరో మూడు కేసులు చుట్టుకున్నాయి. దాదాపు 17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్నారు. ఓ పక్క ఏసీబీ కోర్టు, మరో పక్క ఏపీ హైకోర్టు, ఆ పైన సుప్రీం కోర్టులోనూ న్యాయం కోసం పోరాటం సాగిస్తున్నారు చంద్రబాబు.

Nara Bhuvaneswari Praying On St.Paul's lutheran church rajamundry Over Chandrababu Arrest
Nara Bhuvaneswari Praying On St.Paul’s lutheran church rajamundry Over Chandrababu Arrest

అయితే న్యాయస్థానాల్లో ఆశించిన తక్షణ ఊరట ఆయన లభించడం లేదు. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీ నుండి పెద్ద పెద్ద న్యాయవాదులను ఎంగేజ్ చేయడంతో వారు ఏసీబీ కోర్టు మొదలు కొని హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ చంద్రబాబు కోసం బలమైన వాదనలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం ఇంత వరకూ రాలేదు.

Nara Bhuvaneswari Praying On St.Paul's lutheran church rajamundry Over Chandrababu Arrest
Nara Bhuvaneswari Praying On St.Paul’s lutheran church rajamundry Over Chandrababu Arrest

ఓ పక్క చంద్రబాబు ఈ కేసుల నుండి బయటపడలేదు. మరో పక్క లోకేష్ ను ఓ కేసులో నిందితుడుగా సీఐడీ చేర్చేసింది. ఆయన అరెస్టు రేపో మాపో అన్నట్లుగా ఉంది. పరిస్థితులు ఈ విధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు అవినీతి కేసుల నుండి కడిగిన ముత్యంలా బయటపడాలని కోరుకుంటూ ప్రార్థనాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రీసెంట్ గా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. బాబును కేసుల నుండి బయటపడేయాలనీ, కష్టాలు తొలగిపోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

Nara Bhuvaneswari Praying On St.Paul's lutheran church rajamundry Over Chandrababu Arrest
Nara Bhuvaneswari Praying On St.Paul’s lutheran church rajamundry Over Chandrababu Arrest

ఆ తర్వాత నిన్న రాజమండ్రిలో లూథరస్ చర్చిలో టీడీపీ నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక రేపో మాపో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబుపై న్యాయదేవత కరుణ చూపాలని మసీదుల్లో ప్రార్థనలు కూడా చేసే అవకాశం ఉంది. భువనేశ్వరి మొరను దేవుళ్లు ఆలకించి న్యాయదేవతకు సిఫార్సు చేస్తారేమో చూడాలి మరి. కోర్టుల చుట్టూ భర్త బాబు తిరుగుతుంటే .. ప్రార్థనాలయాల చుట్టూ భార్య భువనేశ్వరి ప్రదక్షిణలు చేస్తొందంటూ ప్రత్యర్ధులు సెటైర్ లు వేస్తున్నారు.

Nara Lokesh: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju