ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

అడ్డంగా దొరికిన అఖిలప్రియ … జ‌డ్జీ ముందే అలా చేయ‌డంతో…

Share

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. హైదరాబాద్ బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది.

అనంత‌రం ఆమెకు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించ‌డంతో చంచ‌ల్‌గూడా జైలుకు త‌ర‌లించారు. అయితే ఈ ప‌రంప‌ర‌లో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి.

 

అఖిల‌ప్రియ … అంత ఈజీ కాదమ్మ‌

అఖిలను 3 రోజుల పాటు విచారించిన పోలీసులు 300లకు పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అసలు ఈ కిడ్నాప్‌ ఎలా జరిగింది ? ఎవరెవరు పాల్గొన్నారు ? ఎలా స్కెచ్‌ వేశారు ? కాస్టూమ్స్‌ నుంచి ఎస్కేప్‌ వరకు ఎలా వ్యూహం రచించారు ? ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఎవరు ఏ రోల్‌ పోషించారో తెలిసిపోయింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు మొదట దాటవేసేందుకు ప్రయత్నించిన అఖిలప్రియ… ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. సాంకేతిక ఆధారాలను కూడా ముందుంచడంతో… కొన్నింటిని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇక మిగిలింది అదే…

అఖిలప్రియ కస్టడీ ముగిసిన అనంత‌రం గురువారం న్యాయమూర్తి నివాసంలో ఆమెను హాజరుపరిచారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి అఖిలప్రియను న్యాయమూర్తి ఇంటికి బోయినపల్లి పోలీసులు తీసుకు వెళ్ళారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి అఖిలకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు పక్కాగా ఉండడంతో ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్‌గూడా మహిళా జైలుకు పోలీసులు తరలించారు . ఇదిలాఉండ‌గా, ఈ కిడ్నాప్ కేసులో భార్గవరామ్, మాదాల శ్రీను, చంద్రహాస్ ప్రధాన నిందితులుగా ఉండగా.. అఖిలప్రియ కీలకంగా వ్యవహరించారు.ఇక భార్గవ్‌ రామ్‌, గుంటూరు శీనును పట్టుకోవడమే మిగిలింది.


Share

Related posts

రెడ్‌మీ నోట్ 9 భార‌త మార్కెట్‌లో.. ధ‌ర త‌క్కువే..!

Srikanth A

Hebba patel: హెబ్బా పటేల్ కెరీర్ ఇంత త్వరగా దెబ్బ తినడానికి కారణం ఆమె చేసిన అలాంటి పనులేనా..?

GRK

Jagananna AirPorts: జగన్ ఎయిర్ పోర్టులు నిజమే..! ఈ జిల్లాల్లో అవకాశం.. కానీ..?

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar