NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

TG Venkatesh: సీఎం కేసిఆర్ ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలంటూ రాయలసీమ బీజేపీ ఎంపి కీలక వ్యాఖ్యలు

TG Venkatesh: ఏపి, తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రులు ఏపిపై తీవ్ర వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు చేస్తున్నా అధికార వైసీపీ నుండి గట్టి కౌంటర్ లు పడటం లేదు. ఈ తరుణంలో రాయలసీమకు చెందిన బీజేపీ ఎంపి టీజీ వెంకటేష్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపి ప్రజల ఓట్లు ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ నీటి గొడవ మొదలు పెట్టారని అన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు ఇన్ని రోజులుగా సాగునీటి అవసరాలకు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. కేసిఆర్ ఆమోదంతోనే 2015లో ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయని టీజీ గుర్తు చేశారు. ప్రాజెక్టులో 845 అడుగుల నిల్వ ఉంటే తప్ప రాయలసీమకు నీరు తీసుకువెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

TG Venkatesh comments on water dispute
TG Venkatesh comments on water dispute

తెలంగాణ నేతలు బెదిరిస్తే ఏపి నాయకులు భయపడరని టీజీ అన్నారు. దీనికి కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఓట్లు లేవు. కానీ తెలంగాణలో ఏపికి చెందిన టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రజలకు ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నీటి సమస్య పరిష్కారం విషయంలో  చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ, చిన్న పొరపాటు జరిగినా తరతరాలు నాయకులను ప్రజలు క్షమించరని పేర్కొన్నారు టీజీ వెంకటేష్.

Read more: Bandi Sanjay: ముక్కు నేలకు రాసి ‘కేసిఆర్” పొర్లు దండాలు పెట్టాలంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

జల వివాదం విషయంలో ఏపి నాయకులు ఎక్కడా పొరపాటు పడకుండా అందరూ ఒకే మాటపై ఉంటే పరిష్కారం లభిస్తుందనీ, ఏపికి మంచి జరుగుతుందని టీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మాటల గారడీ లేకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా సమస్యను పరిష్కరించుకోవాలని టీజీ సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju