NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ లో ఏ సర్టిఫికెట్ రాజకీయాలు!!

ఒక రాష్ట్ర ప్రజలకు, కోట్ల మంది జనానికి ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సిన వ్యక్తులు… భవిష్యత్తు తరాలకు తాము ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడాల్సిన వ్యక్తులు… మాట్లాడుతున్న మాటలు, వారు చేస్తున్న వ్యాఖ్యలు సెన్సార్ సినిమాను తలపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఏ సర్టిఫికెట్ రాజకీయాలు గా మారుతున్నాయి. ఇంట్లో టీవీ పెట్టి కుటుంబసమేతంగా చూస్తూ ఉంటే ఏ ఛానల్ లో ఏ మంత్రి ఏం మాట్లాడతాడో.. ఏ ప్రజాప్రతినిధుల నుంచి ఏ బూతు మాటలు వినాల్సి వస్తుందో… అన్న భయంతో వార్తలను సైతం కుటుంబ సభ్యులంతా కలిసి చూసేందుకు భయపడే పరిస్థితుల్లో ఏపీలో నెలకొంటున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో అనదగిన మాటలు కావు. ఇవి ఏపీ రాజకీయాల్లో మరో స్థాయికి దిగజారుస్తూన్నాయి.

పోటపోటీగా….

జగన్ క్యాబినెట్ లో మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు… పనిలో అయితే కాదు.. కేవలం ప్రత్యర్థుల్ని బూతులతో దూషించడం లో, అనకూడని రాయకూడదని మాటలు అనడం లో మంత్రులు ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఒక్కరే ప్రెస్మీట్ పెడితే బూతుపురాణం ఇతరుల్ని… ఇష్టానుసారం మాట్లాడితే ఇబ్బంది పెడతారని పేరుండేది. తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లాకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆయన తోడయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహం దోషం విషయంలో ఆలయ చైర్మన్ గా ఉన్న అశోక్గజపతిరాజు ఆయన వెధవ అంటూ సంబోధించడం అది అని మాధ్యమాల్లో ప్రసారం కావడం… దీంతోపాటు తెదేపా అధినేత చంద్రబాబును లోకేష్ ను సైతం ఆయన ఇష్టానుసారం మాట్లాడడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. విలేకరుల సమావేశం పెడితే లైవ్ ఇవ్వాలా వద్దా అన్ని టీవీ ఛానల్ వారు భయపడే పరిస్థితిని వీరు కల్పిస్తున్నారు. అసభ్యకరమైన పదజాలంతో ఇతరులను దూషించటం.. రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకు పడడం ఇప్పుడు ఏపీ మంత్రుల్లో కొత్త ట్రెండ్.

జగన్ మనసు గెలుస్తారా?

ఈ ఏడాది ఏపీ మంత్రులకు రెండున్నరేళ్లు పూర్తవుతుంది. నవంబర్ నాటికి జగన్ చెప్పిన దాని ప్రకారం మంత్రివర్గాన్ని పూర్తిగా కొత్తవాళ్లతో నింపే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ప్రత్యర్థుల్ని తమ వ్యాఖ్యలతో మాటలతో ఇరుకున పెట్టేందుకు మంత్రులు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని ద్వారా ఫైర్బ్రాండ్ గా ముద్ర వేయించుకుని జగన్ మంత్రివర్గంలో మరోదఫా కొనసాగేందుకు వీరు ఎత్తులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా. అయితే దీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్వాగతిస్తే మాత్రం భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు తప్పవు. ఇలాంటి మాటలు వ్యాఖ్యలను సాధారణ ప్రజానీకం ఎవరు స్వాగతించారు. ఇప్పటికే కొడాలి నాని విషయంలో వైఎస్ఆర్సిపి బ్యాడ్ ఇమేజ్ ముద్రపడింది. ఇప్పుడు ఆయనకు తోడుగా మరి కొందరు మంత్రులు సైతం ఇదే తీరున వెళ్తే మొత్తం ప్రభుత్వానికే మచ్చ తప్పదు. దీన్ని వెంటనే జగన్ గుర్తించి మంత్రులకు సరైన సూచనలు ఇవ్వడమే ముందున్న కర్తవ్యం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju