వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డును ఢిల్లీ లో అందుకున్నారు. స్థాయి సంఘం చైర్మన్ హోదాలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ప్రజలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తాను చైర్మన్ గా ఉన్న స్థాయి సంఘానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా విజయసాయి రెడ్డి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల పలువురు వైసీపీ నేతలు, సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఏపి పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్న సీఎం జగన్
ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023