NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP Vs TDP: జగన్, చంద్రబాబు బటన్ నొక్కుడులో తేడా ఇదీ ..! వైసీపీ విమర్శనాత్మక కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్

Share

YCP Vs TDP: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ విజయవాడలో వైఎస్ఆర్ వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా వాహనదారులకు వాహన మిత్ర పథకం సాయాన్ని అందించిన సీఎం వైఎస్ జగన్ ఈ రోజు అయిదవ విడత ఆర్ధిక సాయాన్ని పంపిణీ చేశారు. ఈ పథకం కింద రూ.10వేల చొప్పున 2 లక్షల 75వేల 931 మందికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా వైసీపీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన కార్టూన్ ను పోస్టు చేసింది. చంద్రబాబు, జగన్ హయాంలో జరుగుతున్న బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఉన్న తేడా ఇది అన్నట్లుగా పోస్టు చేసిన విమర్శనాత్మక కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chandrababu ys jagan

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాల అమలులో భాగంగా సీఎం జగన్ వివిధ పథకాలకు సంబంధించిన నిధుల పంపిణీకి బటన్ నొక్కుతూ నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు. కానీ చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్థ ఖాతాల్లోకి నగదు జమ అవుతుందనీ, మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళుతోందని విమర్శించింది వైసీపీ. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం. అమరవాతి అసైన్డ్ భూముల స్కాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాం లో అంతర్లీనంగా జరిగింది ఇదే నంటూ వైసీపీ విమర్శించింది. ఇప్పుడు వైసీపీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nara Lokesh: నారా లోకేష యువగళం పాదయాత్ర అప్పటి వరకు లేనట్టే..?


Share

Related posts

కార్గిల్ ప్రధాని మోడీ .. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు

somaraju sharma

‘కోడి కత్తి’అంటే బాబుకు భయం : కన్నా

Siva Prasad

Saranga Dariya : యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో లవ్ స్టోరీ సారంగ దరియా సాంగ్

Varun G