NewsOrbit
బిగ్ స్టోరీ

అచ్చెన్న పై మరొక కేసు… ఇది ఇంకా స్ట్రాంగ్ గా ?

తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు కేసు ని అతని ఆరోగ్య పరిస్థితిని అడ్డంపెట్టుకుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తోంది. వీలైనంత ఎక్కువ సమయం అచ్చెన్నాయుడు ని హాస్పిటల్ కే పరిమితం చేసేలాగా వ్యూహాలు రచిస్తున్న టిడిపి బృందం బెయిల్ వచ్చే వరకు అతను జైలు గోడలు చూడకూడదని భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు సమాధానంగా అతని చుట్టూ మరింత పటిష్టంగా ఉచ్చుబిగిస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

Former AP minister K Atchannaidu, 5 others arrested in 'ESI scam ...


వివరాల్లోకి వెళితే ఇప్పటికీ ఈఎస్ఐ స్కామ్ లో దాదాపు 150 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నిర్ధారించగా ఇప్పుడు మనీలాండరింగ్ మనీ లాబీయింగ్ కేసులు కూడా అచ్చెన్న పై తాజాగా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విలేకరుల ప్రెస్ మీట్ లో వెల్లడించడం గమనార్హం. వాస్తవానికి అవినీతి జరిగిందని నిరూపించాలంటే అరెస్టు అయిన వ్యక్తి లేదా లంచం ఇతర రూపాల్లో అవినీతి సొమ్మును తీసుకున్నట్లు ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. అయితే టెలీ హెల్త్ సర్వీసెస్‌ కు లబ్ది కలిగించేలా అచెన్న లేఖ రాశారని ఏసీబీ తన వాదనలో పేర్కొంది.

ఇక ఈ కేసును మరింత బలపరిచేందుకు ఆ సంస్థ నుంచి అచ్చెన్నాయుడు లేదా అతని కుటుంబానికి చెందిన వారు లేదా అతనివి అని చెప్పబడుతున్న బినామీ కంపెనీల అని ఆరోపించబడుతున్న వాటికైనా ఆ సంస్థ నుండి ప్రయోజనం కలిగినట్లు ఖచ్చితమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అది జరగకపోతే కోర్టు వారి నుండి ఎసిబి అధికారులకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురు పడతాయని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే స్వయంగా స్పీకర్ అచ్చెన్న పై మనీలాండరింగ్ మరియు మనీ లేయింగ్ కేసులు పెడతామని ప్రకటించడం ఇప్పుడు పెద్ద దుమారం లేపింది.

నిజానికి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అచ్చెన్నయుడు అతని పై అసెంబ్లీ లో విపరీతంగా విరుచుకు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అచ్చెన్నాయుడు జగన్ లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేసిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తుండగా జగన్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు యొక్క పారదర్శకతను ప్రశ్నించాడు. ఇప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్లు మాత్రమే కాకుండా అందుకు సంబంధించిన లోగుట్టు వ్యవహారం చాలానే నడిచిందని వైసిపి వర్గాలు చెబుతూ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ప్రభుత్వం ఏసీబీ అధికారులకు సహకరిస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇదే కనుక నిజమైతే నిజంగా అచ్చెన్నాయుడు కథ కంచికి వచ్చేసినట్లే. ఈ ఎస్ ఐ మందుల కొనుగోళ్ల‌లో భారీ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కొంతమంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం ఎక్కువ ధ‌ర‌కు మందులు కొనుగోలు చేసినట్టు  దర్యాప్తులో వెల్ల‌డైంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాథ‌మికంగా అంచ‌నా మేర‌కు మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటుగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju