NewsOrbit
బిగ్ స్టోరీ

ఆశ.. దోశ.. అప్పడం…

మీరిచ్చే ఆఫర్ తీసుకోడానికి జగనేమైనా చంద్రబాబా?

ఏమో అనుకుంటే ఇంకేదో అయ్యిందంట… ఇదీ చంద్రబాబునాయుడు వర్షన్. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పరిస్థితిపై ఎన్నో అపనమ్మకాలు… అనుమానాలు పార్టీ అధినేత చంద్రబాబును వెంటాడాయ్. ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయ్… ఎన్నికల్లో ఘోర ఓటమి… ఎడ్డెమంటే… తెడ్డెమనే అధికార పార్టీ… ప్రతిపక్షానికి భవిష్యత్‎పై ఎంతో గందరగోళం కలిగింది. ఇలాంటి పరిస్థితిలో సీఎం జనగ్మోహన్ రెడ్డి విధానాలపై పోరుబాట సాగిస్తున్న ప్రతిపక్షానికి ఇప్పుడు అమరావతి… రాజకీయ అస్త్రంగా లభించింది. ఏ అంశం దొరుకుతుందా… సీఎం జగన్మోహన్ రెడ్డిని దులిపేద్దామని భావిస్తున్న ప్రతిపక్షానికి ఇప్పుడు అతిపెద్ద మసాలా ఫుడ్ ఐటెమ్ అమరావతి రూపంలో లభించింది.

asha dosha appadam
asha dosha appadam

40 ఇయర్స్ ఇండస్ట్రీ లాభమేంటి?

సమయమూ… సందర్భమంటారు… దేనికైనా కాలం కలిసిరావాలి… లేకుంటే ఎంత లాక్కున్నా.. పీక్కున్నా ఏమీ జరగదు. అందుకే చేయాల్సిన పనులు చేయాల్సినప్పుడు చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబించినా ప్రతికూల ఫలితాలే వస్తాయని అనాదిగా రుజువవుతోంది. సో ఇప్పుడు 14 ఏళ్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడికి ఇప్పుడు అదే వర్తిస్తుంది. రాజకీయంగా కిందపడినా… పైచేయి తనదే అనుకునే బాబుగారి ఫిలాసఫీకి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనాలు…గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా రేపంటే రేపే సర్కారు కూలిపోతుందని ఎన్నో అంశాలతో ఊదరగొట్టారు. నాడు వైఎస్ పులివెందులలోని అసైన్డ్ భూముల వ్యవహారాన్ని బూచిగా చూపిస్తూ నానా యాగీ చేశారు. ఆ తర్వాత చాలా అంశాలను అలాగే హైలెట్ చేసి చలికాచుకున్నారు. నాడు వాటిని వైఎస్ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ వాటిని పట్టించుకునే అవకాశమే లేదు.

Andhra Pradesh move on assigned lands in Amaravati to hit TD hard
Andhra Pradesh move on assigned lands in Amaravati to hit TD hard

అసెంబ్లీ రద్దుతో తేలిపోతుంది

ఇక అసలు విషయానికి వస్తే… వైసీపీ నేతలు 3 రాజధానులు చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఎందుకు ప్రకటించలేదంటూ విమర్శలు గుప్పించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇచ్చినవే కాకుండా… ఇవ్వని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పుకుంటున్న మీరు అమరావతి రాజధాని విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరిస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీరు గెలిస్తే ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోతామంటూ జగన్ సర్కారుకు ఓ రేంజ్ ఆఫర్ ప్రకటించారు చంద్రబాబు.

అమరావతి పాపం ఎవరిది?

జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తన మాట తను కూడా వినడు. ఇప్పుడు ఏ రాజకీయం చేయాలని చూసినా… సవాల్ గా తీసుకోడానికి ఆయనకు పెద్దగా అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు. ఒక్కడిగా తొమ్మిదేళ్లు పోరాటం చేశాడు. ఓవైపు టీడీపీ మరోవైపు ఎల్లో బ్రిగేడ్… రెంటినీ కాదని సాగించిన పోరాటానికి ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులను సక్రమంగా చేయకుండా… రాజధాని ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు చంద్రబాబు. రైతుల సైతం నాడు ప్రభుత్వానికి భూములిచ్చామంటున్నారు… నిజమే… రైతులు తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో వెనకడుగేసేది లేదంటున్నారు కదా… ఇప్పటికిప్పుడు అమరావతికి నష్టం జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత భూములిచ్చిన రైతులదే. రాజకీయనేతల మాటలు… పైపెచ్చు నాడు మోసం చేసిన వారే నేడు మేళ్లు చేస్తామంటూ ఇస్తున్న హామీలను నమ్మితి ఇక అంతే.. రైతులు ఇప్పుడు పాలకులకు తమ సమస్యలు చెప్పుకనే అవకాశం ఉంది కదా… కేవలం తమ మాటే చెల్లుబడి అవ్వాలంటే ఎలా… పసుపు నీళ్లు చల్లారనో… కక్షగట్టారనో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు.

కౌంటర్ ఓ రేంజ్ లో ఉండబోతుందా?

రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని అని… సమస్య పరిష్కారమవుతుందంటే రాజీనామాకు సిద్ధమంటూ చంద్రబాబు సవాల్ విసిరుతున్నారు. ఐతే బాబు గారి సవాల్ ను స్వీకరించేవారెవరు? అసెంబ్లీ రద్దు సవాల్ కు జగన్ సర్కారు నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో ఇట్టే ఊహించవచ్చు. కచ్చితంగా కౌంటర్ ఉంటుంది… అయితే బాబు సవాల్‎కు ఇంకా చాలా విషయాలు జోడింపబడతాయ్. మొత్తంగా జగన్ అండ్ కో ఇప్పుడు టీడీపీకి సుర్రు సుమ్మైపోయే ఓ రేంజ్ కౌంటర్ తో రాబోతుంది
… బాబు గారూ ఇక కాస్కోండి…

 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju