NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ప్లాన్ ప్రకారమే రిస్క్ లోకి వెళ్లిన జగన్..! “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

సీఎం జగన్ హై రిస్కులో పడ్డారు. ఒక కొండను ఢీ కొట్టారు. అందుకు కావాల్సిన అస్త్రాలు, ఆయుధాలు కొన్ని సమకూర్చుకుని కొండతో కయ్యానికి వెళ్లారు. తన ఆయుధాలు ఆ కొండని పిండి చేస్తే ఒకే.. లేకపోతే నిరాయుధుడుగా మిగిలిపోతాడు..!! ఈ విషయాన్నీ “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది. సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ విషయాన్నీ అనేక ప్రధాన మీడియాలు సైతం ఎన్డీఏలో చేరడానికి.., తన కేసుల గురించి అనీ.., సొంత పనుల గురించి అనీ రాశాయి … కేవలం “న్యూస్ ఆర్బిట్” మాత్రమే ఎన్వీ రమణ గురించి అని రాసింది. ఇప్పుడు అదే జరిగింది..! ఇది ఇక్కడితో ఆగదు. రెండు కీలక వ్యవస్థల మధ్య పోరు తారస్థాయికి చేరితో అది ఎలా ఉంటుందో ఏపీకి తెలియనుంది..!! ఈ అంశంపై “న్యూస్ ఆర్బిట్” లో అక్టోబర్ 8 న ఒక ఆర్టికల్ ప్రచురితం అయింది. “బీజేపీ ఎత్తులు..! సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కోసం సీఎం జగన్ రిస్క్ గేమ్..! సంచలన కథనం” అని కథనం రాసాము..!

Also Read >> బీజేపీ ఎత్తులు..! సుప్రీం చీఫ్ జస్టిస్ కోసం జగన్ రిస్క్ గేమ్..! సంచలన కథనం

రమణ గురించి మూడు నెలల ముందే..!!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. తన వ్యక్తిగత కేసులను కెలికితే.., తన ఉనికికి నష్టం వస్తుంది. దీనికి ఎక్కడో చోట మూలాల్లోకి వెళ్లి లాగకపోతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ఒకవేళ జస్టిస్ రమణ సుప్రీమ్ కి ప్రధాన న్యాయమూర్తి అయితే ఇక తనను పూర్తిగా అడ్డుకట్ట వేస్తారు. అది జరగకమునుపే సీఎం జగన్ ఆయన్ను ఆ స్థానానికి వెళ్లకుండా ఆపితే కొంత గెలిచినట్టే. అందుకే రిస్క్ చేశారు. దీని మూలాల్లోకి జగన్ వెళ్లారు. కానీ సాదాసీదాగా కాదు. ఒక ప్లాన్, ఒక పధ్ధతి, ఒక వ్యూహం ప్రకారమే వెళ్లారు. జగన్ ఈ విషయంలో పక్కా ప్రణాళికగా ఉన్నారు. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ఢీ కొట్టాలి అంటే కచ్చితంగా తగిన ఆధారాలు ఉండాలి. ముందుగానే సిద్ధమవ్వాలి. అన్నీ సమకూర్చుకుని కేంద్రం మద్దతు తీసుకోవాలి. జగన్ అదే చేశారు.

ఎన్వీ రమణ ఆస్తుల లావాదేవీలు లాగారు. ముఖ్యంగా చంద్రబాబుతో ఉన్న బంధాన్ని లాగారు. దమ్మాలపాటితో ఉన్న అనుబంధాన్ని బయటకు తీశారు. వారి కుమార్తెలు, భార్య, కుటుంబ సభ్యుల అందరి ఆస్తుల వివరాలు బయటకు తీశారు. “అతను అక్రమాస్తులు కూడబెట్టారు. చంద్రబాబుతో బంధం ఉంది” అని నిర్ధారణ జరిగిన తర్వాత ఈ మొత్తం జాబితాతో కేంద్ర పెద్దలను కలిశారు. అక్కడ అనుమతి వచ్చిందో.. లేదో కానీ జగన్ మాత్రం ముందుకే వెళ్లారు. ఇక్కడ జగన్ కి బీజేపీ(కేంద్రం) మద్దతు ఉందా..? లేదా..? అనేది పక్కన పెడితే తగిన పాయింట్లు మాత్రం ఉన్నాయి. బలం ఉంది. ఒక వ్యవస్థ జగన్ చేతిలో ఉంది. కేంద్రం పూర్తిగా మద్దతుగా ఉండకపోయినా చూసీ చూడనట్టు ఉంటూ .. అత్యవసర వేళల్లో తోడు ఉంటె చాలు జగన్ గెలిచినట్టే..!!

 

 

curiosity over high court decision
curiosity over high court decision

సీఎం గెలవగలడా..? నిలవగలడా..? 

ఏపీ హైకోర్టులో వస్తున్న తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ హస్తం ఉంది, ఆయన ప్రభావితం చేస్తున్నారు అనేది జగన్ అతి పెద్ద ఆరోపణ. “హైకోర్టుని రమణ నియంత్రిస్తున్నారు.., తీర్పులను ప్రభావితం చేస్తున్నారు.. చంద్రబాబుతో ఆయనకు మంచి బంధం ఉంది. అందుకే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి” అంటూ తన వద్ద ఉన్న ఆధారాలతో సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. నిజానికి ఈ లేఖ చట్టబద్ధత ఉండదు. సీజే కచ్చితంగా స్పందించాలి అని ఏమి ఉండదు. కానీ సీఎం స్థాయిలో సుప్రీమ్ న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు, హైకోర్టు తీర్పులను ప్రభావితం వంటి అంశాలను రాశారు అంటే.. జాతీయ స్థాయిలో కీలక అంశమే. కేంద్రం, సుప్రీమ్ కోర్టు.., ఉన్నత వ్యవస్థ కూడా ఆలోచించుకుని సరిచేయాల్సిన అంశం. అందుకే జగన్ కెలికారు. ముందుకెళ్లారు. రిస్క్ చేశారు.

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju