NewsOrbit
బిగ్ స్టోరీ

ఎందుకు పోరాడాలి!?

నేను ‘యాదృఛ్ఛిక రాజకీయవేత్త’ (Accidental Politician) అయ్యాక ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఎప్పుడూ కూడా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నవాడినే. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు పార్లమెంట్ ఎన్నికలలో పోటి చెయ్యాలి అని ఎవరైనా సలహా ఇచ్చుంటే మాత్రం నేను నా స్నేహితులు నవ్వి ఉండేవాళ్ళం.

నేను శిక్షణ పరంగా విద్యారంగం వ్యక్తినే కావచ్చు. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో ఎటు చూసినా – అది వాస్తవంగా కానివ్వండి, వ్యవస్థాగతంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి – హింస రాజ్యమేలుతున్నది. అందువలన అన్నిటికన్నా ముందు నేనొక కార్యకర్తను. ఈ రోజున ఐదు సంవత్సరాల ఈ ప్రభుత్వ పాలన తరువాత నేను రాజకీయాలలో ఉన్నాను. అయినా కూడా ఇప్పటికీ నేను ‘రాజకీయవేత్త’ ను కాదు.

ప్రత్యామ్నాయ రాజకీయాలలో భాగస్వామిని అవ్వటం నా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటే ఏమిటి? విద్వేషానికి, అణిచివేతకి వ్యతిరేకంగా నిలబడి పోరాడే రాజకీయాలు; మనలో మనల్ని విడదీస్తున్న వాటిని కాదని మనల్ని ఏకం చేసే వాటిని ప్రోత్సహించే రాజకీయాలు; వ్యక్తిగత హక్కులను, సమ్మిళిత అభివృద్దిని, అభ్యుదయ ఆలోచనా ధోరణిని ప్రోత్సహించే రాజకీయాలు; గత ఐదు సంవత్సరాలలో జరిగిన నష్టాన్ని పూడ్చటమే కాకుండా రాబోయే ఇరవై సంవత్సరాలలో అందుబాటులో ఉండే అవకాశాలని అందిపుచ్చుకోవటానికి అనువైన పరిస్థితులు కలిపించే ప్రజాస్వామ్య రాజకీయాలు. వీటి కోసమే మన పోరాటం. ఇది నా కథ.

నేను ఎవరు అనే ఈ కథ పెద్దగా ప్రత్యేకమైనది ఏమి కాదు. నేను ఒకప్పుడు నా చుట్టుపక్కల వ్యక్తుల మాదిరే ఉండేవాడిని. పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నాను, కళాశాలలో ఉన్నప్పుడు కోచింగ్ సెంటర్లలో పనిచేసాను, ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకి చదువుకుంటున్నప్పుడు ఉద్యోగం చేశాను. నా సోదరుడు అస్సాంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ నా సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం డబ్బులు పంపేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం యు.పి.ఎస్.సి పరీక్షకి సిశాట్(CSAT) పరీక్షని అనుబంధంగా జతపరిచిందో ఆ రోజే నా సివిల్ సర్వీసెస్ అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హిందీ మాధ్యమంలో చదివినవారికి, అందులోనూ హ్యుమానిటీస్ విద్యార్ధులకి సివిల్ సర్వీసెస్ సాధించే అవకాశాలని సిశాట్ పరీక్ష పూర్తిగా దూరం చేసింది. అంతేకాక సిశాట్ శిక్షణ నా తాహతుకి మించింది. కానీ దాని గురించి నాకేమి పశ్చాతాపం లేదు.  సివిల్ సర్వీసెస్ కోసం శిక్షణ పొండుతున్నప్పుడే అకాడమిక్, రాజకీయ సృహ ఏర్పడింది నాకు. ఇక్కడివరకూ అంతా మామూలే.

నేను నా పరిశోధన ద్వారా నా ప్రజల అభ్యున్నతికి పాటుపడగలను అని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు నాకు అర్థమయ్యింది. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. తనకంటూ ఒక ప్రత్యేక జీవనం కలిగిన స్థలం అది. కేవలం పాఠ్యపుస్తకాల నుండే కాక జీవిత అనుభవాల నుండి, సామాజిక ఉద్యమాల నుండి ఒక స్వేచ్చాపూరిత జ్ఞాన సముపార్జనకి అనుకూలమైన వాతావరణం ఉన్న ప్రదేశం అది. నాకు యాక్టివిజం ఎప్పుడూ ప్రాధాన్యత కలిగిన విషయంగానే ఉండేది. విద్యార్ధి సంఘం అధ్యక్ష పదవికి పోటి చేసినప్పుడు అంత భారీ సంఖ్యలో విద్యార్ధులు నాకు మద్దతు పలుకుతారని నేను ఊహించనే లేదు. అప్పుడే, అక్కడే నా జీవితం పూర్తిగా మలుపు తిరిగింది.

నా రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ అధికారంలో ఉండి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాను, విమర్శిస్తూనే ఉన్నాను. కానీ ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న యంత్రాంగం పూర్తిగా ప్రత్యేకమైనది. పోలీసుల వేధింపులు, లాఠీ చార్జి అనేవి ఇంతముందు కూడా ఉన్నాయి. నిందారోపణలు, నకిలీ వార్తలు, విద్వేషం, ‘దేశ ద్రోహి’ అనే అపవాదు – ఈ తరహా అస్త్రాలతో కలిసికట్టుగా దాడులు చేయడం మాత్రం ఈ ఆమధ్య కాలంలో వచ్చినదే. గ్రీకు రాజనీతిజ్ఞుడు పెరిక్లిజ్‌కు ఎక్కువమంది ఆపాదించే సామెత ఒకటి ఉంది: ‘నీకు రాజకీయాలు అంటే ఆసక్తి లేకపోవచ్చు. కానీ రాజకీయాలకు నీపై ఆసక్తి ఉండొచ్చు’. నేను రాజకీయాలపై ఆసక్తి చూపించాను, అలాగే రాజకీయం కూడా ఖచ్చితంగా నాపై ఆసక్తి చూపించింది.

రాజ్యం మా మీద దాడి చేసినప్పుడు మా ముందు రెండు దారులు ఉన్నాయి – పోరాడటం లేదా లొంగిపోవటం. కానీ నిజానికి నాదృష్టిలో ఉన్నది ఒకే దారి. అందుకనే మేము పోరాడాం, ఆ పోరాటమే ఈ రోజు నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చింది. ఆ పార్టీకో, ఈ పార్టీకో ప్రత్యామ్నాయం ఏంటో  చెప్పటానికి కాదు నేను ఈ రోజు రాజకీయాలలో ఉన్నది; ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా ఉండాలో చూపించటానికి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు కేవలం అణిచివేతపై పోరాటాలకే పరిమితం కాదు; ఇవి స్వేఛ్చ, సమానత్వం కోసం. ఇవి కేవలం బిజెపి-ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆధిపత్య రాజకీయాలపై పోరాటానికే కాదు; అంబేద్కర్ కాంక్షించిన సామాజిక సమ్మిళితం కోసం కూడా. ఇవి కేవలం మూకస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కాదు; ప్రజల నిజమైన భాగస్వామ్యం గల  ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న రాజకీయాలు. ఇది నా ఒక్కడి పోరాటం కాదు; మీది కూడా.

మార్పు రావటానికి చేయాల్సిన మొదటి పని ఏమిటంటే రాజకీయాలను సంపన్నుల చేతి నుంచి సామాన్య ప్రజల చేతిలోకి తీసుకురావాలి. ఈ సామాన్య ప్రజలే ప్రభుత్వానికి నిధులు సమకూర్చేది. అయినా కూడా వారికి సంబంధించిన విషయాలు ఏవి కూడా మనం చేసే చర్చలలో భాగం కావు. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రభుత్వం కాదు; ఇది ధనికుల కోసం నడుపుతున్న ఒక రాజకీయ యంత్రం. అటువంటి వ్యవస్థలనే మనం కూల్చాలి; ప్రభుత్వాన్ని తిరిగి ప్రజల పరం చెయ్యాలి.

విధాన-ఆధారిత ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడం రెండవ పని. విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, మౌలిక వసతుల కల్పన బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే విధానం గురించి మనం మాట్లాడాలి. అణగారిన వర్గాల పక్షాన మనం మాట్లాడాలి. కేవలం మైనారిటీల పక్షానే కాదు, భిన్న లైంగికత్వం కలిగిన వారి పక్షాన  కూడా మాట్లాడాలి. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, అలాగే సమ్మతి హక్కు గురించి కూడా. ఈ రోజు దేశం ముందున్న కొత్త రకం సవాళ్లు – దీర్ఘకాలం మనగలిగే పర్యావరణ సుస్థిరత, డిజిటల్ విప్లవం, గోప్యత హక్కు గురించి కూడా మనం మాట్లాడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పైన పేర్కొన్న ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రాతిపదికన ప్రజలని సమీకరించి, వారికి వీటి గురించి వివరించి  ఆ ప్రాతిపదికనే ఓటు వెయ్యాలి.

చివరగా చెప్పేది ఏమిటంటే ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రాతిపదికనే మనం మన ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దుకోవాలి. నియమావళి ఆధారిత ప్రజాస్వామ్యం నుండి ప్రజల భాగస్వామ్యం గల ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఒక కొత్త సంక్షేమ విధానం రూపొందించటానికి సహకరిస్తాయి. ఆ విధానం పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సమ్మిళితంగా ఉండాలి. ఆ ప్రజాస్వామ్యం అణిచివేతకు గురయిన వర్గాల వారి గోడు వినాలి, అధికార పీఠంతో సత్యం చెప్పగలిగాలి. ప్రతి ఒక్కరికి నిర్భయంగా మాట్లాడే హక్కు, సమీకరించుకునే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు కలగలిపి ఉన్న నిజమైన భాగస్వామ్యానికి ప్రతినిధిగా ఉండాలి. కేవలం ఇటువంటి చట్రం ద్వారానే మనం కలకాలం నిలవగలిగే ప్రజాస్వామ్యాన్ని; గతంలో తీరకుండా మిగిలిపోయిన ఆకాంక్షలని సాకారం చేసుకునే భవిష్య భారతావనికి దారితీసే ప్రజాస్వామ్యన్ని ఏర్పాటు చేసుకోగలం.

పోరాడుదాం. గెలుద్దాం.

-కన్నయ్య కుమార్

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment