NewsOrbit
బిగ్ స్టోరీ

జగన్ ప్రభుత్వంపై సుప్రీంకు కేసీఆర్ సర్కార్…!

సీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని పిటీషన్

తెలంగాణకు నష్టమంటూ వాదన

ఏపీ..తెలంగాణ మధ్య కొద్ది రోజులగా వివాదాస్పదంగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్ణయం పైన తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఈ పధకం కోసం జారీ చేసిన ఉత్తర్వుల ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.

KCR govt to supreme over Jagan government
KCR govt to supreme over Jagan government

ఇప్పటికే ఇదే అంశం పైన అటు ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఏపీకి దక్కే వాటాలో ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకుంటామని..తెలంగాణకు నష్టం ఉండదని చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి దీని కారణంగా ఏపీ సీఎం జగన్ తో తనకు వివాదం రాదని..సమస్యను పరిష్కరించుకుం టామని గతంలోనే స్పష్టం చేసారు. కేంద్ర జలశక్తి శాఖ రోజునే రెండు రాష్ట్రాల నీటి వివాదాల పైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా..అందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది.

ఈ నెల 20వ తేదీ తరువాత సమావేశం ఏర్పాటు చేయాలని లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు పైన టెండర్ల ప్రక్రియ..జ్యుడిషియల్ రివ్యూ మొదలు పెట్టింది. తెలంగాణకు రావాల్సిన చుక్క నీరు కూడా వదులుకోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంలో ఈ-పిటీషన్ దాఖలు చేయటం ద్వారా…ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టు పైన న్యాయ పోరాటం ఆరంభమైంది.

సుప్రీంలో పిటీషన్..ప్రాజెక్టును అడ్డుకోండి

ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత పలుమార్లు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక సమస్యల మీద చర్చించారు. హైదరాబాద్ లోని ఏపీకి చెందిన సచివాలయ భవనాల అప్పగింత వంటి నిర్ణయాలు చకాచకా జరిగిపోయాయి. తెలంగాణ నుండి శ్రీశైలం వరకు భారీ ఎత్తిపోతల పధకానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కసరత్తు చేసారు. అయితే, అది ప్రతిపా దన స్థాయిలోనే నిలిచిపోయింది. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ…రాయలసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించి జీవో జారీ చేసింది. దీని పైన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టాయి.

ఏపీలో మాత్రం జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ పైన మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు. దీని ద్వారా జగన్ తో మీ స్నేహం కొనసాగుతుందా..అంటే ఖచ్చితంగా కొనసాగుతుందని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం క్రిష్ణా రివర్ బోర్డుకు ఈ ప్రాజెక్టు మీద ఫిర్యాదు చేయటంతో..దీని పైన ముందుకు వెళ్లవద్దంటూ బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ సైతం తమకు రావాల్సిన నీటి చుక్కను కూడా వదులుకొనేది లేదని స్వయంగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

ఏపీ ప్రభుత్వ వాదన ఇలా…

ఈ ప్రాజెక్టు గురించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయం నుండి తెలంగాణలో విమర్శలు మొదలయ్యాయి. సమైక్య రాష్ట్రంలో నీటి పంపకాల్లో తెలంగాణ ప్రాంత భారీగా నష్టపోయిందని..ఇప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తమ పిటీషన లో పేర్కొన్నారు. దీని పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నిర్ధిష్ట అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి జగన్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఏడాది లో 15 రోజులు మాత్రమే వరద నీరు వస్తుందని..తెలంగాణకు ఎటువంటి నష్టం లేకుండా..

ఏపీకి దక్కే నీటి వాటాలోనే ఈ ప్రాజెక్టు ను వినియోగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, క్రిష్ణా ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లవద్దంటూ లేఖ రాయటం పైన సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఉత్తర్వులను రద్దు చేయాలని..టెండర్ల ప్రక్రియ ముందుకు పోకుండా అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju