NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Team India : నిజంగా ఇది మన భారత క్రికెట్ జట్టేనా..? వెస్టిండీస్, ఆస్ట్రేలియా లను మించిన ఆధిపత్యం

Team India in terrific form

Team India : భారత క్రికెట్ జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా 1983 ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత దేశంలో క్రికెట్ కు ప్రాధాన్యత రెట్టింపు అయింది. అయితే ఆ ప్రపంచకప్ కు ముందు రెండు వరల్డ్ కప్ లు జరిగాయి. రెండింటిలో విండీస్ గెలిచింది. ఆ తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు వాళ్ళదే ఆధిపత్యం. అప్పుడు వచ్చింది ఆస్ట్రేలియా వెలుగులోకి. 1987 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఆ తర్వాత 1999 నుండి 2007 వరకు వరుసగా హ్యాట్రిక్ వరల్డ్ కప్ లు గెలిచింది. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచి ఆ ఆధిపత్యానికి ముగింపు పలికారు.

 

Team India in terrific form
INDIAN CRICKET TEAM

అవి కూడా పట్టేస్తే…

ఇప్పుడు 2021…! మధ్యలో 2015 లో ఆస్ట్రేలియా 2019లో ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలిచినప్పటికీ ఈ దశాబ్దంలో వారు పూర్తి ఆధిపత్యం చెలాయించలేకపోయారు. రెండింటిలో టీమిండియా సెమీ ఫైనలిస్ట్. పైగా ఆతిథ్య జట్టులే ట్రోఫీ కొట్టాయి. పైపెచ్చు గత ఐదేళ్ళ నుండి భారత అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిస్తున్న హవా అంతా ఇంతా కాదు. అతిముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది. సొంతగడ్డపై టెస్టుల్లో ఓటమి అనే మాటే లేదు. టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువ ఓడిపోతే గొప్ప. ఇక వన్డేలు, టీ-20 లు విదేశీ గడ్డ మీద కి వెళ్లి ఒక ఆట ఆడుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లలో టెస్ట్ సిరీస్ లు గెలిస్తే చాలుఇప్పటివరకు ఉన్న భారత జట్లలో ఇదే అత్యంత గొప్ప జట్టుగా అవతరిస్తుంది. అది కూడా ఎంతో దూరం లేదు అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Team India : ఆసీస్ కే చుక్కలు…

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో వారి గడ్డపైనే ఆసీస్ సీనియర్ ప్లేయర్లు అందరిని మన ఇండియా జూనియర్ ఆటగాళ్లు పిల్లలను ఆడుకున్నట్లు ఆడుకున్నారు. బ్రిస్బేన్ లో చివరి టెస్ట్ మ్యాచ్లో చేసిన అద్భుతం అయితే తరతరాలు చెప్పుకునేది. గబ్బా లాంటి పేస్ వికెట్ పై భారత్ చూపించిన అసమాన ఆటతీరు గాలివాటంగా వచ్చిన విజయం అయితే కాదు. ఎన్నో ఏళ్లుగా భారత పేస్ దళాన్ని, యువ బ్యాట్స్మెన్ ని పర్యవేక్షిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దారు మన భారత క్రికెట్ బోర్డు వారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ హోదాలో వచ్చిన ఇంగ్లాండ్ టెస్ట్, టి20 సిరీస్ లలో పరాజయాలు మూటగట్టుకుంది.

అలా పుంజుకోవడం ఏంటి?

నిన్న జరిగిన మ్యాచ్ సంగతికి వస్తే…. అసలు గెలుపుపై ఆసలు లేని స్థితి నుండి భారత్ అనూహ్యంగా పుంజుకుని కేవలం 110 పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్ ఫుల్ స్ట్రెంత్ టీం ను ఆల్ అవుట్ చేసిన విధానం భారత ప్రేక్షకులను అబ్బుర పరిచింది. అది కూడా ప్రధాన బౌలర్లు అయిన బుమ్రా, జడేజా, షమీ సహాయం లేకుండా. అసలు ఇంతటి ఆధిపత్యం అనేది భారత క్రికెట్ జట్టులో ఏనాడూ కనిపించలేదు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ లకు కూడా ఒకానొక సమయంలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, భారత్. పాకిస్తాన్ జట్లు గట్టిపోటీని ఇచ్చేవి. 

Team India : దగ్గర్లోనే అన్నీ టైటిల్స్…!

అయితే ఇప్పుడు భారత్ జోరు చూస్తుంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నేను సైతం వణికిస్తున్న తీరులో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి మరొక కనీసం ఐదేళ్ల పాటు భారత్ ప్రపంచ క్రికెట్ ను ఏలుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. భారత్ కు గట్టి పోటీ ఇచ్చేటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరంలో టీ-20 ప్రపంచ కప్ మన దేశంలోనే జరగబోతోంది, ఆ తర్వాత మరో రెండేళ్ళలో వన్డే ప్రపంచ కప్ కూడా ఇక్కడే. జూన్ లో న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్. ఇది టెస్టుల్లో ప్రపంచ కప్ లాంటిది.  మరి వీటి తర్వాతమరో ఐదేళ్ళలో భారత్ ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో వేచి చూడాలి.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N