NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP-Janasena : మొక్కుబడి పొత్తు ముగిసినట్లేనా?

BJP-Janasena to party ways?

BJP-Janasena : భారతీయ జనతా పార్టీజనసేన పార్టీ లకి ప్రస్తుతం అసలు పడడం లేదు. పవన్ కళ్యాణ్ ఏకంగా తెలంగాణ బిజెపి పై ధ్వజమెత్తిమొన్నటి ఎన్నికల్లో తాము టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సహకరిస్తాం కానీ తెలంగాణలో బిజెపికి సహకరించమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ముందే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సీట్ కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి దక్కించుకొని జనసేన పార్టీకి మొండిచేయి చూపింది.

 

BJP-Janasena to party ways?
bjp janasena

అప్పుడు మొదలైంది

ఇప్పుడు అంతా జనసేనబిజెపి పొత్తు కథ కంచికి వచ్చింది అని అనుకుంటున్నారు. అసలు జనసేనభారతీయ జనతా పార్టీ చేతులు కలిపినప్పుడే రెండు భిన్న ధ్రువాలు ఎలా ఒకేచోట ఉండగలవు అని అందరికీ అనుమానం కలిగింది. ఇక ఇదే సమయంలో కమలనాథులు రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు లేకపోయినా పవన్ కళ్యాణ్ ను మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువైపోయాయి. వీటికీ గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నాంది పలికాయి అని చెప్పాలి.

పాపం పవన్..!

పవన్ కళ్యాణ్ పాపం ప్రతి చోట తగ్గుతూ వచ్చాడు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను పోటీ చేయించాలని అనుకొని చివరి నిమిషంలో బీజెపి నేతల జోక్యంతో వారిని విత్ డ్రా చేయించారు. ఇక అప్పుడే తిరుపతి ఉప ఎన్నికను జనసేన ఇస్తామని హామీ ఇస్తేనే పవన్ అందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఇక్కడ కూడా బిజెపి అవకాశం తన్నుకుపోయింది. అందుకు నిరసనగానే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి కి మద్దతు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారని కూడా పలువురు చెబుతున్నారు.

BJP-Janasena : నేతలూ అంతంతమాత్రమే

ఒక పక్కేమో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచంద్ర పోటీ చేస్తుంటే పవన్ మాత్రం వాణి కి ఓటేయండి అని పిలుపునివ్వడంతో కమలనాథులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ రెండు పార్టీల నేతలకు ప్రస్తుతం కలిసి ఉండడం అసలు ఇష్టం లేదన్న వార్తలు బయటకు వస్తున్నాయి. వారి వ్యవహార శైలి చూస్తేనే ఈ విషయం తేటతెల్లమవుతోంది అని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడ, వైజాగ్ కార్పొరేషన్లో రెండు పార్టీలు వేరు వేరుగానే పోటీ చేశాయి. దాని వల్ల ఎవరికీ ఏమీ ఒరగలేదు అనుకోండి అది వేరే విషయంఅయితే తెగతెంపులు చేసుకోవడానికి మాత్రం జనసేనబిజెపి రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరి అది ఎంత కాలంలోగా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju