30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
బిగ్ స్టోరీ

రిషి సునక్: బ్రిటన్ లో నవ యుగం ఆరంభం

Rishi Sunak బ్రిటన్ లో నవ యుగం ఆరంభం
Share

రిషి సునక్: ప్రస్తుతం ప్రపంచం లో అందరి దృష్టి ని ఆకర్షించిన ఒకే ఒక వ్యక్తి రిషి సునక్! ఆయన ఈ మంగళవారం బ్రిటన్ ప్రధాని గా నియమితులయ్యారు. బ్రిటిష్ రాజు మూడవ చార్లెస్ రిషి సునక్ ను ప్రధాని గా ప్రకటించారు.గత 200 సంవత్సరాల బ్రిటీష్ చరిత్ర లో ప్రధాని పదవిని చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా, మొదటి శ్వేత జాతీయేతరుడిగా, మొదటి క్రైస్తవేతరుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

రిషి సునక్ ఎవరు?

రిషి సునక్, 1980 మే 12 వ తేదీన సౌతాంప్టన్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు భారత సంతతికి చెందిన వారు. వారు 1960 లో ఈస్ట్ ఆఫ్రికా నుండి బ్రిటన్ కు వలస వెళ్లారు. ఆయన వించెస్టర్ కాలేజ్ నుండి ఫిలాసఫీ లో , లింకన్ కాలేజ్ నుండి పాలిటిక్స్ మరియు ఎకనామిక్స్ లలో పట్టభద్రులయ్యారు. తరువాత ప్రముఖ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ లో పట్టా పొందారు. ఆయన సతీమణి ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి గారి కుమార్తె కావటం విశేషం. రిషి సునక్ 2014 లో మొదటి సారిగా బ్రిటన్ లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నార్త్ యార్క్ షైర్ నుండి బ్రిటిష్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయం లో ఆయన ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ గా తన బాధ్యతలను నిర్వర్తించారు. గడచిన గత ఆరు నెలలుగా బ్రిటన్ లో జరిగిన రాజకీయ పరిణామాల మధ్య మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆవిడ రాజీనామా చేయటం తో ప్రధాని పీటం రిషి సునక్ ను వరించింది.

Rishi Sunak: బ్రిటన్ లో నవ యుగం ఆరంభం
Rishi Sunak: బ్రిటన్ లో నవ యుగం ఆరంభం

బ్రిటన్ లో అత్యంత సంపన్నుల్లో రిషి సునక్ ఒకరు:

ప్రస్తుత ప్రధాని రిషి సునక్ మరియు ఆయన సతీమణి అక్షతా మూర్తి దంపతుల ఆస్తుల విలువ దాదాపుగా 7 వేల కోట్ల రూపాయలుగా ఉన్నదని సండే టైమ్స్ రిచ్ లిస్ట్ పేర్కొంది. అంతే కాక యు కె లో ఉన్న 250 మంది అత్యంత సంపన్నుల జాబితాలో వీరికి 222 వ స్థానం దక్కింది. అనేక బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం, రిషి సునక్ భార్య అక్షతా మూర్తి , ఇటీవలే మరణించిన ఎలిజబెత్ మహారాణి కంటే కూడా సంపన్నురాలని, ఆవిడ ఆస్తుల విలువ 4 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా.

వీరి ఇరువురికీ, లండన్ లో రెండు ఇళ్ళు, యార్క్ షైర్ లో ఒకటి , ఎల్ యే లో ఒకటి కలిపి మొత్తం నాలుగు చోట్లా ఇళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. వాటి విలువ 140 కోట్ల రూపాయలు దాకా ఉండవచ్చని అంచనా.

ముందున్న సవాళ్ళు :

ప్రస్తుతం బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యూరప్ లో రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణం గా ప్రపంచ వ్యాప్తం గా తీవ్ర పరిస్తితులు వున్న సమయం లో ఆయనకు అనేక సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్తితి ని గాడి లో పెట్టాలన్నా, పరిస్తితులను చక్క దిద్దాలన్నా ఎవరికయినా కత్తి మీద సాము లాంటిదే! ఆయన మొదటి ప్రసంగం లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పై విమర్శలు గుప్పించారు. ” ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరి దిద్దటానికే తాను బాధ్యతలను చేపట్టానని, బ్రిటన్ ప్రజల ఉన్నతి కోసం ఎల్ల వేళలా శ్రమిస్తానని, సరైన మార్గం లో బ్రిటన్ ను ముందుకు తీసుకెళ్తానని” ఆయన అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ బయట ప్రధానిగా మొదటి ప్రసంగం సాగింది.

 


Share

Related posts

దీపావళి వేళ..! ఆత్మనిర్భర్ భారత్ 3.O …!!

Vissu

ABN RK : ఏబీఎన్ ఆర్కేది జర్నలిజమా..? శాపనార్ధమా..? శాడిజమా..!?

Srinivas Manem

బ్రాహ్మణవాదం…శ్రమశక్తి!

Siva Prasad