Aamir Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ అయినా తెరపై పండించడంలో హీరో అమీర్ ఖాన్ సిద్ధహస్తుడు. ఎప్పుడు ఒకేలా సినిమాలు చేయకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ ప్రతి సినిమాకి మేకవర్ మారుస్తూ ప్రేక్షకులను వైవిధ్యంగా అలరిస్తూ ఉంటాడు. అమీర్ ఖాన్ సినిమా రిలీజ్ అయింది అంటే నిర్మాతలకు కాసుల వర్షమే. ఇండియాలో “బాహుబలి” విడుదల కాకముందు అమీర్ ఖాన్ నటించిన “దంగల్” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.
ఇదిలా ఉంటే ఈ ఏడాది అమీర్ నటించిన “లాల్ సింగ్ చడ్డా” రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. ఈ సినిమా విడుదల అవ్వకముందే భారీగా వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా నిరసన గడ్డం తెల్ల జుట్టుతో చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. ఒక నటుడిగా సినిమా చేస్తున్నంత సేపు జీవితంలో మరొకటి ఉండదు. దీంతో ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ ప్రస్తుతం ఉంది. “లాల్ సింగ్ చడ్డా” విడుదలయ్యాక “ఛాంపియన్స్” అనే మూవీ చేయాల్సి ఉంది.
ఇది ఒక వైవిద్య భరితమైన స్టోరీ. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నాకు సినిమా చేయాలని లేదు. విశ్రాంతి తీసుకోవాలని తల్లి మరియు పిల్లలతో ఇంకా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని ఉంది. గత 35 సంవత్సరాల నుండి సినిమాలు చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా సినిమా ప్రపంచంలోనే. అదే ధ్యాసతో పని చేస్తూ వచ్చాను. మరి ఈ రకంగా అయితే కరెక్ట్ కాదనిపించింది. దీంతో నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆ రీతిగా వారితో కలిసి జీవితాన్ని మరో కోణంలో చూడటానికి… ఇదే సరైన సమయం అనిపిస్తుంది కాబట్టి మరో ఏడాదిన్నర పాటు… సినిమాలకు బ్రేక్ కెమెరా ముందుకు వెళ్లే ప్రసక్తి లేదు అని అమీర్ ఖాన్ తేల్చి చెప్పారు.