బన్నీ… గోవిందం అవుతాడా?

నాపేరు సూర్య సినిమా తో మరో ప్లాప్ చవిచూశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై బన్నీ చాలా ఆశలు పెట్టుకున్నాడు.. అయితే తీరా సినిమా విడుదలయ్యాక ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో,వేసవిలో విడుదల అయిన పెద్ద సినిమాలలో అతి పెద్ద ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది నాపేరు సూర్య. ఈ నేపథ్యంలో బన్నీ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనే ఆలోచనలో పడిపోయాడు.

నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని డైరెక్టర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. నాపేరు సూర్య సినిమా రిలీజ్ టైంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుత పరిస్థితులు బట్టి అల్లు అర్జున్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాలనుకుంటున్నాడట. కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయమైనా ఎరుగని కొరటాల అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తీయగలరని ఆయన ఆలోచిస్తున్నారట. కొరటాల కూడా ప్రస్తుతం భరత్ అనే నేను విజయం తరువాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు కూడా అయితే కొరటాల తన నెక్స్ట్ చిరుతో సినిమా చేయ్యలని చూస్తున్నాడు.

ఇక అదేవిధంగా త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన ఈ కాంబో సినిమా వస్తుంది అంటేనే మినిమమ్ గ్యారెంటీ అనే ధీమా ఉంది కానీ చాలా రోజులుగా ఈ కలయిక గురించి వార్తలైతే వస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ కన్నా ముందు బన్నీ, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ ఫైనల్ కాకపోవడంతో విక్రమ్ సైడ్ అయిపోయాడు. సో మళ్లీ త్రివిక్రమ్ పేరే వినిపించడం మొదలైంది కానీ అఫీషియల్ గా ఎలాంటి ఇంఫార్మేషన్ రావట్లేదు. ఇప్పుడు బన్నీ డైరెక్టర్స్ లిస్ట్ లో కొత్తగా ఒక దర్శకుడు చేరాడు. అతనే గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్. ఈ ఇయర్ మంచి హిట్ ఇచ్చిన పరశురామ్, బన్నీ కోసం రెడీ చేసిన లైన్ నచ్చడంతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని తెరకెక్కించే ఆలోచనలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ అయినా సెట్ అవుతుందా లేక మరేదైనా డైరెక్టర్ తో బన్నీ సినిమా చేస్తాడా అనేది చూడాలి