NewsOrbit
సినిమా

హిట్ కొట్టి మాట్లాడండి

పూరి జగన్నాధ్, హీరోని ఎలివేట్ చేయడంలో దిట్ట. ఎవరు అవునన్నా కాదన్నా హీరోని అద్భుతంగా చూపించడంలో, కొత్తగా ప్రెజెంట్ చేయడంలో పూరీని మించిన దర్శకుడు లేరు. అయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా చుసిన ఇది నిజమని చెప్పకుండా ఉండలేము. పూరి సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది… హీరోని పోకిరిగా చూపించినా, బుజ్జిగాడిని చేసినా, అందరితో ఇడియట్ అనిపించినా హిట్ అందుకోవడం ఆయనకి మాత్రమే సాధ్యం. అందుకే పూరి సినిమా వస్తుంది అంటే హీరోలతో సంబంధం లేకుండా థియేటర్స్ దగ్గర ఆడియన్స్ కనిపిస్తారు.

ఒకప్పుడు హిట్స్ కి, ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా ప్లాన్స్ వేసుకున్నారు. హీరోలతో సమానంగా ఫాలోయింగ్ పెంచుకున్న పూరికి గత కొంత కాలంగా టైం బాగోలేదు, ఏ సినిమా చేసినా, ఎంత కష్టపడినా హిట్ మాత్రం దక్కట్లేదు. రీసెంట్ గా మెహబూబా సినిమాతో అయినా పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే భారీ ఫ్లాప్ ఫేస్ చేసి అభిమానులని నిరాశపరిచాడు. ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న పూరి, తన కేవ్ లోనే కూర్చొని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఏ కథని అని అయినా చాలా త్వరగా రాసే పూరి, ఇంత టైం తీసుకోవడంతో ఏ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నాడో అని అందరూ ఎదురు చూశారు.

పూరి చాలా సీరియస్ గా రెడీ చేసిన ఆ స్క్రిప్ట్ ఎనర్జిటిక్ హీరో రామ్ కోసమని ఇండస్ట్రీ వర్గాలు చాలా రోజులుగా అనుకుంటున్నా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ విషయాన్నీ అందరూ లైట్ తీసుకున్నారు. స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ కావడంతో, రామ్ పూరిల కాంబినేషన్ గురించి పూరి టూరింగ్ టాకీస్ నుంచి అఫీషియల్ న్యూస్ బయటకి వచ్చేసింది. త్వరలో మూవీ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసి హిట్ అందుకోవాలని పూరి చూస్తున్నాడు. రామ్ కి కూడా ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ కావాలి కాబట్టి, పూరి సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చుకొని కొత్తగా కనిపించడానికి సిద్దమవుతున్నాడు. మరి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ ఇద్దరు కలిసి హిట్ ఇస్తారేమో చూడాలి.

Related posts

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment