Anupama: అనుపమ పరమేశ్వరన్.. ఈ అందాల భామ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2015లో వచ్చిన `ప్రేమమ్` అనే మలయాళ చిత్రంతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీలోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అ ఆ`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనుపమ.. ఇక్కడ హీరోయిన్గా బాగానే నిలదొక్కుకుంది.
చివరిగా ఈ భామ `రౌడీ బాయ్స్`ను ప్రేక్షకులను పలకరించింది. ఆశిష్ రెడ్డి హీరోగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 14న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో అనుపమ సరైన హిట్ కోసం చూస్తోంది. ప్రస్తుతం ఈమె నిఖిల్ కలిసి రెండు సినిమాలు చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందులో `కార్తికేయ 2` ఒకటి కాగా.. `18 పేజెస్` మరొకటి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే `బటర్ ఫ్లై` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ తన తొలి సినిమా జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా అందరితోనూ పంచుకుంది.
ఈ మలయాళ ముద్దుగుమ్మకు ఫస్ట్ మూవీ ఆఫర్ చాలా విచిత్రంగా వచ్చిందట. వాస్తవానికి అనుపమ సినిమాల్లో నటించడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదట. కానీ, నటనపై ఉన్న మక్కువతో అనుపమ `ప్రేమమ్` ఆడిషన్స్ కు వెళ్లిందట. కానీ, అక్కడ కెమెరా ముందు నిలబడటం సరిగ్గా రాక ఎంతో ఇబ్బంది పడిందట. అయితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఆమె ఇబ్బందిని చూసి అద్దం ముందు నించుని ప్రాక్టీస్ చేయమని చెప్పాడట. అలా అద్దం ముందు ప్రాక్టీస్ చేయబట్టే.. ప్రేమమ్ కి సెలక్ట్ అయ్యానని అనుపమ పేర్కొంది. ఇక సెలక్ట్ అయ్యాక ఇంట్లో వాళ్లను ఒప్పించడం కోసం ఆమె ఎంతో కష్టపడిందట.