29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun Prabhas: ఆ విషయంలో ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్..?

Share

Allu Arjun Prabhas: తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు నాలుగు సంవత్సరాల నుండి సౌత్ సినిమాల హవా కొనసాగుతూ ఉంది. పటాన్ సినిమా రాకముందు వరకు బాలీవుడ్ సినిమాలు సైతం దక్షిణాది సినిమాలకు పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. బాహుబలి 2 మొదలుకొని మొన్నటి వరకు వచ్చిన కార్తికేయ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటాయి. బాహుబలి 2, KGF 2, RRR, పుష్ప సినిమాలైతే రికార్డు స్థాయి వసూలు రాబట్టాయి. అయితే పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు చలనచిత్ర రంగంలో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ గట్టిగా సత్తా చాటారు అన్న సంగతి తెలిసిందే.

as per remuneration details Allu Arjun crossed Prabhas in south india

బాహుబలి 2తో ప్రభాస్… భారతీయ చలనచిత్ర రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం. ఇక బన్నీ పుష్పతో కూడా బాహుబలి అంతా కలెక్షన్ సాధించకపోయిన గాని… దేశంలో ఇతర విదేశాలలో పుష్ప మేనియా క్రియేట్ చేయడం జరిగింది. తగ్గేదేలే డైలాగ్ అయితే మరీ పాపులర్ అయింది. అలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా హిందీలో పుష్ప దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. దీంతో బన్నీ పేరు విపరీతంగా మారుమోగింది. ఈ క్రమంలో భారతీయ సైనికుల చేత గౌరవ వందనం కూడా బన్నీ.. అందుకున్న స్థాయికి కూడా వెళ్లడం జరిగింది. ఇదిలా ఉంటే రెమ్యూనరేషన్ విషయంలో దక్షిణాదిలో మొన్నటి వరకు ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.

as per remuneration details Allu Arjun crossed Prabhas in south india

అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ కంటే రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్ మొదటి స్థానంలోకి వెళ్లారట. సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న సినిమాకి ఏకంగా 125 కోట్ల రూపాయలు బన్నీ రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. ప్రభాస్ రెమ్యూనరేషన్ చూస్తే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే అన్ని దీంతో… దక్షిణాదిలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా బన్నీ రికార్డు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

nayanthara: నయనతార బర్త్ డే స్పెషల్ .. మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కాబోయే భర్త

Ram

ఆడ‌పిల్ల‌ను ద‌త్త‌త తీసుకున్న మ‌నోజ్‌

Siva Prasad

RRR: చరణ్ లో నేను నేర్చుకున్నది అదే రాజమౌళి సంచలన కామెంట్స్..!!

sekhar