కన్న కూతురు ప్రేమలో ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని బోనీకపూర్ కొట్టిపారేశారు. బోనీ – శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె జాన్వి కపూర్ నటించిన తొలి చిత్రం ‘దఢక్’. ఇందులో కథానాయకుడు ఇషాన. ఇషానతోనే ప్రస్తుతం జాన్వి ప్రేమలో ఉందని, అందుకే ఇద్దరూ కలిసి తరచూ డిన్నర్లకు, పార్టీలకు వెళ్తున్నారంటూ ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదని బోనీకపూర్ అన్నారు. వారిద్దరూ కలిసి ఒక సినిమా చేశారనీ, ఆ సినిమా సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడిందనీ అన్నారు. ఆ స్నేహంతోనే వారిద్దరు కలుస్తున్నారనీ చెప్పారు. తన కుమార్తె పట్ల, ఆమె స్నేహం, ఆమె పరిచయాల పట్ల తనకు గౌరవం ఉందని తెలిపారు. జాన్వి ప్రస్తుతం ‘తక్త్’, ‘కార్గిల్ గర్ల్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇషాన, జాన్వి కలిసి ‘డియర్ కామ్రేడ్’ హిందీ వెర్షనలో నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని కరణ్ జోహార్ తెలిపారు.
previous post
next post