GodFather: మెగాస్టార్ కొత్త సినిమా “గాడ్ ఫాదర్” దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానుంది. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పొలిటికల్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. కాగా ఇటీవలే అనంతపురంలో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వర్షం పడినా గాని చిరంజీవి ఇచ్చిన స్పీచ్ తో మైదానం మొత్తం మారుమోగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ రాజమౌళి అంటే తనకు ఇష్టము అయినా గాని.. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక తనకు లేదన్నారు చిరంజీవి. సినిమాని తెరకెక్కించడంలో ఆయన చాలా సమయం తీసుకోవటమే అందుకు కారణం అని స్పష్టం చేశారు. తాను ఒకేసారి నాలుగైదు చిత్రాలు చేయడంతో ఇది కుదిరే పని కాదని అన్నారు. అందుకే ఆయనతో పని చేయాలని …పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలన్నా తపన తనకు లేదని నవ్వుతూ తెలియజేశారు చిరంజీవి.
బాహుబలి 2, ఆర్ఆర్ఆర్…సృష్టించిన ప్రభంజనానికి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక మంది హీరోలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఆఖరికి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రాజమౌళి ఓకే అంటే సినిమా చేయడానికి ఎప్పటికీ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.