Balakrishna: బాలకృష్ణ Balakrishna టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరు. సుదీర్ఘమైన ఆయన కెరీర్లో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. చేసే పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి మెప్పించడం బాలయ్య స్టయిల్. రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహ, లెజండ్, గౌతమీపుత్ర శాతకర్ణి.. వంటి సినిమాల్లో ఆయన నట విశ్వరూపం చూడొచ్చు. కెరీర్లో అందరిలానే ఆయనకూ ఫ్లాప్స్ వచ్చాయి. అయితే.. ఆ ఫ్లాప్స్ ఆయన్ను కొన్ని వర్గాలకు దూరం చేసాయి. ఇటివల కూడా వరుస ఫ్లాపుల్లోనే ఉన్నారు. అయితే.. బాలయ్య రూటు మార్చినట్టున్నారు. ఔట్ డేటెడ్ సబ్జెక్టులు కాకుండా తన మార్క్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కమిట్ మెంట్స్ చూస్తే ఇదే అనిపిస్తోంది. crazy directors for bala krishna next movies
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. బాలయ్యనను వరుస ఫ్లాపుల నుంచి, రోటీన్ క్యారెక్టర్ల నుంచి బయటపడేసిన దర్శకుడు బోయపాటి. సింహా, లెజండ్ సినిమాల్లో ఆయన పాత్రలను చక్కగా డిజైన్ చేసి బాలయ్యకు మంచి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా అఖండ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. వరుసగా గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Read More:Bellamkonda Srinivas: భారీ వర్షాలకు బెల్లంకొండ ‘ఛత్రపతి’ విలేజ్ సెట్ డ్యామేజ్
ఇప్పటికే బాలయ్యతో సినిమా కోసం గోపీచంద్ ప్రకాశం జిల్లాలోని వేటపాలెంలోని పురాతన లైబ్రరీలో కథాన్వేషణ చేస్తున్న ఫొటో వైరల్ అయింది. ఇటివలే రవితేజతో క్రాక్ వంటి సూపర్ హిట్ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్నాడు గోపిచంద్. ఇక అనిల్ రావిపూడి ఫ్లాపుల్లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘రామారావు గారు’ అనే టైటిల్ తో గతంలో ఓ కథ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడా కాంబినేషన్ ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇలా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా బాలయ్య కొత్త లైనప్ తో వెళ్తున్నారు. ఇవన్నీ నందమూరి అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. మరి.. ఈ కాంబినేషన్లు బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కిస్తాయేమో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!