ట్రెండింగ్ సినిమా

Devatha Serial: హద్దులు మిరుతున్న మాధవ్.. ఆదిత్య బాధకు నువ్వే కారణమా రాధక్క..!

Share

Devatha Serial: రాధకి జానకమ్మ జడ వేస్తుండగా.. దేవి వచ్చి నేను అమ్మకు జడవేసా.. నువ్వు చిన్మయికి జడ వెయ్యి అవ్వ అని అంటుంది. అలా అందరూ కూర్చుని జడలు వేస్తుండగా మాధవ్ వచ్చి సెల్ఫి అంటూ రాధకు దగ్గరగా కూర్చుని ఇటు చూడు రాధ సెల్ఫీ అంటూ దగ్గర కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు.. మాధవ్ చేసే ఓవర్ యాక్షన్ కు రాధకు మండిపోతుంది. ఏంటి దేవుడా నన్ను నా బ్రతుకును ఇలా రాసావ్ అని మనసులో అనుకుంటుంది..

Devatha Serial: 5 May 2022 Today Episode Highlights
Devatha Serial: 5 May 2022 Today Episode Highlights

ఆదిత్య ఏదో విషయం గురించి తనకు చెప్పకుండా బాధపడతున్నాడని తెలుసుకున్న సత్య.. ఆ విషయాన్ని తన అక్క రాధను అడిగి తెలుసుకోవాలని తన దగ్గరకు వస్తుంది. అక్క ఆదిత్య ఈ మధ్య ఎందుకో అదోలా ఉంటున్నాడు. అక్క ఆదిత్య బాధకు నువ్వేమైనా కారణమా అని అడుగుతుంది. దాంతో రాదా కోపంగా చూసే సరికి.. దేవి విషయంలో మళ్ళీ మీ ఇద్దరి మధ్య కానీ ఇంట్లో కానీ ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. అలాంటిది ఏమీ లేదని రాధా చెబుతుంది. రాధ, సత్య మాట్లాడుకుంటున్న మాటలను మాధవ్ చాటుగా నిల్చుని వింటాడు. అది గమనించిన రాధా ఇక్కడ కాదు ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం పదా అని అంటుంది.

Devatha Serial: 5 May 2022 Today Episode Highlights
Devatha Serial: 5 May 2022 Today Episode Highlights

రాధ సత్య ఇద్దరు వంటగదిలో నుంచి బయటకు వస్తుండగా మాధవ్ అక్కడే నుంచుని ఉండడం గమనించిన సత్య.. ఏంటి బావ ఇటు వచ్చావు అని అడుగుతుంది. కాఫీ కావాలని రాధ ని అడుగుదాం అని వచ్చాను అని అంటాడు. నేను పెట్టనా అంటే రాధ ఇస్తుంది అని అంటాడు. సరే అక్క నేను వెళ్తున్నాను అని సత్య అంటుంది. రాధా నీ గతానికి సంబంధించిన వస్తువులతోపాటు మనుషులు కూడా నా కళ్ళముందు కనిపించడానికి ఇష్టం లేదు అని అంటాడు. ఇండైరెక్ట్ గా ఆదిత్య, సత్య వాళ్ళు ఈ ఇంటికి రాకూడదు అని చెబుతాడు. రాధా ఏం సమాధానం చెబుతుందో తరువాయి భాగంలో చూద్దాం.


Share

Related posts

‘ఆచార్య’ సినిమాపై అప్డేట్… హీరోయిన్ ఎవరో తెలుసా?

Naina

గోవాలో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య…!

arun kanna

NTR 30: ఎన్టీఆర్- కొరటాల మూవీ బడ్జెట్ కి సంబంధించి కొత్త డీటెయిల్స్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar