వర్మ… వినగానే రామ్ గోపాల్ వర్మ గురించి చెప్తున్నాం అనుకోకండి. చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న వర్మ గురించి. తెలుగులో కల్ట్ క్లాసిక్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాకి తమిళ రీమేక్ గా వస్తున్న మూవీనే ఈ వర్మ. విభిన్న చిత్రాల దర్శకుడు బాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు, పైగా విక్రమ్ లాంటి నటుడి వారసుడు ఇండస్ట్రీలోకి ఈ కథతో ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే తమిళ ప్రేక్షకులు వర్మపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. వాటికీ తగ్గట్లే గతంలో వచ్చిన టీజర్ నేటివిటీకి తగ్గట్లు ఉంది అక్కడి ప్రేక్షకులకి నచ్చింది కూడా. అయితే అర్జున్ రెడ్డి సినిమాని, అందులో అర్జున్ కనిపించిన విజయ్ దేవరకొండ నటన చూసిన వాళ్లకి మాత్రం వర్మ టీజర్ అస్సలు ఎక్కలేదు. దీంతో టీజర్ చూసే మన వాళ్లు, దేవరకొండ ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి రేంజులో ఈ సినిమా లేదంటూ కామెంట్స్ చేశారు.
అది మర్చిపోక వర్మ సినిమా నుంచి ఇప్పుడు వచ్చింది, దాదాపు సినిమాకి మార్పులు లేకుండా తీసిన బాల, అర్జున్ రెడ్డి సినిమాలోని సోల్ ని పట్టుకోవడం మిస్ అయినట్లు ఉన్నాడు. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా అస్సలు లేకపోవడంతో మరోసారి వర్మపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి క్లాసిక్ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటేనే కొన్ని అంచనాలు ఉంటాయి, వర్మ ట్రైలర్ వాటిని పూర్తిగా అందుకోలేకపోయింది. ముఖ్యంగా లీడ్ రోల్ ప్లే చేసిన ధృవ్, అసలు ఏ యాంగిల్ లో కూడా విజయ్ దేవరకొండని మరిపించలేకపోయాడు. కథ నచ్చి చేసినట్లు ఉన్నాడు తప్ప, పెద్దగా హోమ్ వర్క్ చేసినట్లు అనిపించలేదు. స్టూడెంట్ లుక్ లో ధృవ్ బాగున్నా కూడా, లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ పాత్రలో మాత్రం అసలు బాగోలేడు, గడ్డం కూడా అతికించినట్లు ఉంది కానీ నాచురల్ గా లేదు. హీరోయిన్, హీరో, ఇతర అమ్మాయిల మధ్య వచ్చే సన్నివేశాలని అర్జున్ రెడ్డి ట్రైలర్ లో కట్ చేసినట్లే చూపించారు కానీ ఒక్క మార్పు కూడా కనపడలేదు. అర్జున్ రెడ్డి లాంటి యూనివర్సల్ కథని డీల్ చేయడంలో బాల పూర్తిగా విఫలమయ్యాడు. విక్రమ్ కొడుకు అనే పాయింట్ వదిలేసి అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చకుండా, విజయ్ దేవరకొండని గుర్తు తెచ్చుకోకుండా వర్మని చూస్తే నచ్చుతుందేమో కానీ ఇప్పటికే నోటా సినిమాతో తమిళనాట ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మెప్పించిన విజయ్ దేవరకొండని హీరోగా నిలబెట్టిన చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు చూడలేదు అనుకుంటే పొరపాటే. సో వాళ్లు వర్మకి వెళ్లేప్పుడు అర్జున్ రెడ్డిని మర్చిపోయి వెళితేనే ఎంజాయ్ చేయగలరు లేదంటే మాత్రం విక్రమ్ లాంటి స్టార్ హీరో, గొప్ప నటుడి వారసుడు ఒక ఫ్లాప్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఇవ్వడం ఖాయం.
previous post
next post