మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ మెగా డాటర్.. నాగబాబు గారాల పట్టి నిహారిక. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ మై కడవులే సినిమాతో కోలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్సెల్వన్ సరసన నటిస్తుంది. స్వాతి ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది. జె.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది.
ఇక నిహారిక తమిళంలో ‘ఒరు నల్ల నాళ్ పాతు సొల్రెన్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకొని అక్కడ ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా హీరోయిన్ గా మాత్రం నిహారిక బాగా పాపులర్ అయింది. అంతేకాదు బుల్లితెర మీద యాంకర్ గాను సత్తా చాటింది.
ఇక నిహారిక త్వరలో పెళ్ళి పీటలెక్కడానికి మెగా ఫ్యామిలీ భారీగా సన్నాహాలు చేస్తున్నారట. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నిహారిక తను చేసుకొనే అబ్బాయిని పరిచయం చేసి హాట్ టాపిక్ అయింది. గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక పెళ్ళి కి సిద్దమవుతోంది. ఆగస్టులో నిశ్చితార్ధం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక నిహారిక చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్ళికి సిద్దమవుతూనే కమిటయిన సినిమాని కంప్లీట్ చేనున్న నిహారిక కమిట్మెంట్ కి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.