సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్యల్లో పైరసీ ఒకటి. ఈ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన `గద్దలకొండ గణేష్` పైరసీ బారిన పడింది. ఆన్లైన్ పైరసీ వెబ్సైట్ తమిళ్ రాకర్స్ ఈ చిత్రాన్ని విడుదలైన మరుసటిరోజునే ఆన్లైన్లో పెట్టేశారు. ఇది దర్శక నిర్మాతలకు ఎంతో బాధాకరమైన విషయం. ఓ సినిమా తెరెక్కించడానికి దర్శక నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు నిద్రాహారాలు మాని కష్టపడతారు. అయితే పైరసీదారులకు అవేమీ తెలియవు. ఇతరుల కష్టాన్ని దోచేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలను ఛాలెంజ్ చేసి అనుకున్న టైమ్‌లో లీక్ చేస్తున్న తమిళ్ రాకర్స్ ఇప్పుడు `గద్దలకొండ గణేష్`ను క్లియర్ ప్రింట్‌తో లీక్ చేసి యూనిట్‌కి షాకిచ్చింది. ఈ ఆన్లైన్ పైరసీ వెబ్‌సైట్‌పై పలు పైరసీ సెల్‌కు పలు ఫిర్యాదులు అందినా వారేం చేయలేకపోతున్నారు. అందుకు కారణం సదరు తమిళరాకర్స్ సంస్థ ఓ డొమైన్లో కాకుండా..పలు డొమైన్స్‌ను ఉపయోగించుకోవడమేనని సినీ వర్గాలు అంటున్నాయి.
previous post
next post