మహేష్ బాబు కెరియర్ లో మలుపు తిప్పిన సినిమా “పోకిరి”. ఈ సినిమా విజయంతో ప్రిన్స్ గా ఉన్న మహేష్ టాగ్ లైన్ సూపర్ స్టార్ గా మారిపోయింది. మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు 40 సంవత్సరాల టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసి “పోకిరి” ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ డైలాగులను మహేష్ పలికిన విధానం.. సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నపాటి ట్విస్ట్ తో పాటు డైలాగులు… టేకింగ్ తో పూరి తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. వంద రోజులు 200 సెంటర్లలో “పోకిరి” ఆడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇష్టం లేకపోయినా గాని మహేష్ సినిమాలో ఆ పాత్ర చేశాను ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్స్..!!
ముఖ్యంగా మణిశర్మ అందించిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమాతో టాలీవుడ్ నెంబర్వన్ హీరోగా పోటీలో మహేష్ రావడం జరిగింది. ఈ సినిమా తర్వాత మహేష్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. 2006వ సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమా.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మళ్లీ “పోకిరి” సినిమా 4K క్వాలిటీ ప్రింట్ తో సిద్ధమవుతోంది.
అంత మాత్రమే కాదు ఆగస్టు 9వ తారీకు “పోకిరి” 4K క్వాలిటీ ప్రింట్ మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. కచ్చితంగా ఇది మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్. పైగా ఆరోజు మహేష్ పుట్టినరోజు కావడం విశేషం. ప్రస్తుతం మహేష్ వరుస పెట్టి నాలుగు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇక వచ్చే నెల నుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…