ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: గాల్లో తేలుతున్న తులసి..! పాతాళానికి పడిపోయిన నందు..!

Share

Intinti Gruhalakshmi: తులసి పంజాబీ డ్రెస్ ఇంటర్వ్యూ కి బయల్దేరుతుంది.. దివ్య, తన అత్తమామలు తులసికి ఆల్ ద బెస్ట్ చెప్పి ఇంటర్వ్యూకి పంపిస్తారు.. తులసి ఇంటర్వ్యూ వెళ్లేసరికి నందు అక్కడే ఉంటాడు.. అయినా ఇద్దరు ఒకరికి ఒకరు తెలియనట్టు ప్రవర్తిస్తారు.. ఇక ఆ ఇంటర్వ్యూయర్ తులసి కి క్వాలిఫికేషన్ లేదని మీ కష్టం తెలిసిన కూడా నేను ఎటువంటి హెల్ప్ చేయలేనని చెబుతారు.. దాంతో మౌనంగా బయటకు వస్తుంది అంతలో మళ్ళీ ఇంటర్వ్యూయర్ నుంచి లోపలికి రమ్మని తులసికి పిలుపు వస్తుంది..!

Intinti Gruhalakshmi Serial 12 may 2022 Today episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 may 2022 Today episode Highlights

నందు తులసి బయటకు వెళ్లిపోయిన తర్వాత తన ఫ్రెండ్ తో తులసి ఎవరో కాదు తన భార్య అని చెబుతాడు.. దాంతో తులసినీ వెనక్కి ఇస్తాడు ఆ కంపెనీ మేనేజర్.. ఏంటి వదినా నువ్వు ఇప్పుడు దాకా నా దగ్గర మాజక్ చేసావా.. నందు వాళ్ళ వైఫ్ అని చెప్పి ఉంటే నీకు కళ్ళు మూసుకొని ఉద్యోగం ఇచ్చే వాడిని అని అంటాడు.. దాంతో తులసి నందు తనకు చేసిన అన్యాయం గురించి చెబుతుంది.. అటువంటి వాళ్ళని నేను భర్తగా కూడా ఊహించడం లేదు.. నేను ఏ తోడు లేని ఒంటరి ఆడదానిని.. ఆ విధంగా మీరు దయదలచి నాకు ఉద్యోగం ఇస్తే మీ నమస్కారం పెట్టి ఈ ఉద్యోగం చేయడానికి నేను ఇష్టపడతాను.. అంతేకానీ మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అని.. అది కూడా మిస్టర్ నందగోపాల్ ద్వారా వచ్చే ఉద్యోగం నాకు వద్దు చెప్పి తులసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది..

దాంతో కోపం వచ్చిన నందు ఏదో నీ మీద జాలిపడి ఉద్యోగం ఇప్పిస్తే.. అలా వద్దని చెప్పినా పరువు తీయాలా అని అంటాడు. నేనేమి మిమ్మల్ని నిజాలు చూపించమని అడగడం లేదు కదా.. మీ నుంచి నేను చాలా కోల్పోయాను.. అటువంటప్పుడు ఉద్యోగం కావాలని నేను మిమ్మల్ని అడగడం లేదు కదా.. మీరు ఎందుకు సహాయం చేశారో నాకు తెలుసు.. నా మీద జాలి చూపించి ఉద్యోగం ఇప్పించి హీరో అవుదాం అనుకుంటున్నారా అని అంటుంది తులసి.. లోపల మన ఇద్దరిని హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమా తీయడం లేదు అని అంటాడు.. దాంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెరుగుతుంది..

ఇక రేపటి ఎపిసోడ్ లో నందు తో తులసి గొడవ ముగిశాక.. తులసి ప్రవలిక దగ్గరకి వెళ్తుంది. అలా బయటకు వచ్చిన తరువాత బయట పక్షులు గాల్లో ఎగురుతు ఉంటాయి. అలా చూస్తూ తులసి మనకి రెక్కలు వస్తే బాగుండేది కదా అని ప్రవలికతో అంటుంది..


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటున్న జనాలు..!!

sekhar

రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Teja

ప‌వ‌న్ ప్రొడ‌క్ష‌న్‌… త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌.. చ‌ర‌ణ్ యాక్ష‌న్‌!

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar