Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటివరకు చిరంజీవి తన సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి నటించిన సినిమాలలో ఎక్కువ భాగం సాంఘిక చిత్రాలు చేశారు. కానీ చిరంజీవి శ్రీ మంజునాథ వంటి పౌరాణిక చిత్రంలో శివుడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి సందడి చేశారు. తన సినీ జీవితం మొత్తంలో ఈ ఒక్క సినిమా మాత్రమే పౌరాణిక చిత్రం అని చెప్పవచ్చు. అదే విధంగా తన సినీ జీవితంలో చారిత్రక యోధుడు పాత్రలో తాజాగా “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” సినిమాలో నటించి అందరినీ మెప్పించారు.
జానపద సినిమాల విషయానికొస్తే చిరంజీవి నటించిన శివుడు శివుడు శివుడు సినిమా కాస్త రాజుల కాలం నాటి సినిమాగా తెరకెక్కినదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి శివుడి పాత్రలో కనిపించి సందడి చేశారు. ఆపద్బాంధవుడు కన్నా ముందుగా పార్వతీ పరమేశ్వరులు చిత్రంలో కూడా చిరంజీవి శివుడి పాత్రలో నటించారు. కానీ చిరంజీవి తన సినీ జీవితంలో రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక చిత్రాలలో నటించేలేకపోయారు. కానీ ఓ సినిమాలో భాగంగా చిరంజీవి అర్జునుడి వేషం వేసి ఎంతో అద్భుతంగా నటించారు.
చిరంజీవి స్టేట్ రౌడీ:
చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో భాగంగా చిరంజీవి అర్జునుడి వేషంలో ఎంతో అద్భుతంగా నటించారు. స్టేట్ రౌడీ సినిమాలో గయోపాఖ్యానం ఉండడంతో అందులో చిరంజీవి అర్జునుడి వేషంలో నటించారు. అదే విధంగా ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నూతన ప్రసాద్ నటించగా, గయుడి పాత్రలో రావు గోపాల్ రావు నటించారు. ఈ సినిమాలో భాగంగా కేవలం ఐదు నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో విజయవంతం అయిన ఈ సినిమాను బి.గోపాల్ దర్శకత్వం వహించగా, టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించారు. శ్రీ మంజునాథ సినిమాలో కన్నా ముందుగా చిరంజీవి స్టేట్ రౌడీ సినిమాలో ఈ పౌరాణిక పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇకపోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా భవిష్యత్తులో చిరంజీవి రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక చిత్రాలలో నటిస్తే చూడాలని ప్రేక్షకుల కోరిక. అయితే ప్రేక్షకుల కోరిక చిరంజీవి తీరుస్తారో లేదో ఎదురు చూడాల్సిందే