Jigarthanda 2 teaser: 2014వ సంవత్సరంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన “జిగార్తాండ” సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో దర్శకుడిగా అందరి చేత ప్రశంసలు పొందాడు. సిద్ధార్థ బాబి సింహా లక్ష్మీ మీనన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. పిజ్జా సినిమాతో కెరియర్ ప్రారంభించిన కార్తీక్ సుబ్బరాజు… వరుస విజయాలతో తమిళ సినిమా రంగంలో స్టార్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. ఇదే “జిగార్తాండ” తెలుగులో వాల్మీకి సినిమాతో వరుణ్ తేజ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ తీశాడు.
అయితే కొన్ని వివాదాల కారణంగా వాల్మీకి టైటిల్ “గద్దల కొండ గణేష్” గా రీమేక్ చేసి విజయం సాధించడం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు “జిగార్తాండ-2” సీక్వెల్ రెడీ అవుతుంది. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు… రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్… డ్రామా నేపథ్యంలో స్క్రిప్ట్ ఉన్నట్లు.. ఫస్ట్ టీజర్ బట్టి అర్థమవుతుంది. “జిగార్తాండ-2”..జిగార్తాండ డబుల్ ఎక్స్ గా వస్తున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్ ఉర మాస్ లుక్ లో ఉన్నారు.
ఇంకా ఎస్ జె సూర్య చాలా క్లాసికల్ లుక్ లో… విలనిజం పండిస్తూ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా టీజర్ లో కనిపించడం జరిగింది. ఫస్ట్ టీజర్ లో… ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ క్రియేట్ చేసినట్లు సస్పెన్స్ లో పెట్టి..”జిగార్తాండ-2″ పై సినిమా లవర్స్ కి ఆసక్తి పెంచడం జరిగింది. ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో అధిక స్థాయిలో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ సినిమా డైరెక్ట్ గా తెలుగులో కూడా.. విడుదలవుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో “జిగార్తాండ-2”.. తెరకెక్కిస్తూ అనేక భాషల్లో కార్తీక్ సుబ్బరాజు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. స్టోన్ బెంజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై జరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. మొదటి భాగం తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమర్షియల్ గా “జిగార్తాండ” పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గానీ విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. తెలుగులో అప్పట్లో “చిక్కడు దొరకడు” పేరుతో డబ్ అయింది. కానీ ఈసారి “జిగార్తాండ-2” మాత్రం డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ చేయనున్నారు.