Karthika Deepam: గత ఎపిసోడ్ లో శ్రీవల్లికి పురిటి నొప్పులు రావడం, శ్రీవల్లికి కార్తీక్‌ని వైద్యం చెయ్యమని దీప కోరడం తరువాత అబులెన్స్కి కార్తీక్ కాల్ చెయ్యడం మనకు తెలిసిందే. స్వతహాగా డాక్టర్ అయినటువంటి కార్తీక్ ని, వైద్యం ఎందుకు చేయలేదంటూ దీప నిలదీస్తుంది. దానికి కార్తీక్, డాక్టర్ గా తాను ఎప్పుడో చచ్చిపోయానంటూ ఏవేవో డైలాగులు కొట్టి ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రత్నం చేస్తాడు. దీప మనసు నొచ్చుకుంటుంది. కట్ చేస్తే.. మోనిత కార్తీక్ గురించి ఆలోచన చేస్తూ, “సౌందర్య ఆంటీ.. అసలు కార్తీక్ ఏం అయిపోయాడు” అని ప్రశ్నిస్తూ ఫోన్ ట్రై చేస్తుంది కార్తీక్ నంబర్‌కి.
మొబైల్ దాచిపెట్టిన మహేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా?
సరిగ్గా అదే సమయానికి మహేష్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఫోన్ రింగ్ అవ్వగానే చిరాగ్గా లిఫ్ట్ చేస్తాడు. ఏదో తిడదాం అనే లోపే అవతలివైపు నిండి ‘కార్తీక్.. ఏం అయిపోయావ్ కార్తీక్’ అన్న మాటలు విన్న మహేష్ ‘కార్తీక్ ఎవడు?’ అని అంటాడు. ‘ఇంతకీ నువ్వు ఎవడ్రా’ అంటూ సీరియస్ అవుతుంది మోనిత. డబ్బు కావాలని కోరుతాడు మహేష్. మోనిత అంగీకరించి అకౌంట్ నంబర్ అడుగుతుంది. వెంటనే అకౌంట్‌కి పాతిక వేలు పంపగానే మహేష్ షాక్ అవుతాడు. కార్తీక్ జాడ చెప్పమని మోనిత బతిమిలాడుతుంది.
మహేష్ నిజం చెబుతాడా?
సరిగ్గా ఆ రోజు తాను ఏమి చూశాడో అదంతా చెబుతాడు. అది విన్న మోనితకు సౌందర్య ఆంటీ పైన అనుమానం కలుగుతుంది. కోపంతో ఊగిపోతోంది. కట్ చేస్తే.. చెట్టు కింద ఉన్న శ్రీవల్లి వాళ్ల సామాన్లును కార్తీక్ సర్దుతూ ఉంటాడు. అదే సమయంలో రుద్రాణక్క మనుషులు వచ్చి గొడవ పడతారు. అయినా కార్తీక్ అవేం పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటాడు. దాంతో కోపంతో ఊగిపోయిన రౌడీలు ‘నీ అంతు తరువాత చూస్తాం’ అంటూ అక్కడ నుంచి వెళ్తారు. తరువాయి భాగం మళ్ళీ చదువుదాం..