సినిమా

KGF3: “కేజిఎఫ్ 3” రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ప్రొడ్యూసర్..!!

Share

KGF3: హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో నిర్మాత విజయ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన కేజిఎఫ్, కేజిఎఫ్ 2 దేశంలోనే అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి ఒక్కసారిగా పెంచేయడం జరిగింది. ఈ సినిమాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్..హీరో యాష్ కి ఒక్కసారిగా ఊహించని క్రేజ్ దేశవ్యాప్తంగా ఏర్పడింది. “కేజిఎఫ్ 2” ఇప్పటికీ కూడా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది. సినిమా రిలీజ్ అయి 30 రోజులు కావస్తున్నా గానీ ప్రపంచవ్యాప్తంగా రూ. 580.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 1184.88 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. ఇక ఈ సినిమా 4 వారాల్లోనే ఓవరాల్‌గా 233.86 కోట్ల లాభాలు అందుకుంది.

kgf producer gave clarity kgf 3 movie release

ఇదిలా ఉంటే “కేజీఎఫ్ 2″క్లైమాక్స్ లో మూడో చాప్టర్ కూడా ఉన్నట్లు హింట్ ఇవ్వటంతో… “కేజీఎఫ్ 3” ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది సినిమా ప్రేక్షకుల్లో సస్పెన్స్ నెలకొంది. మూడవ పార్ట్ ప్రకటన కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో “కేజీఎఫ్” సినిమా నిర్మాత విజయ్ మూడో చాప్టర్ కి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది. యూనివర్సల్ సబ్జెక్ట్ తో.. టాప్ మోస్ట్ క్యారెక్టర్ లతో “కేజీఎఫ్ 3” రాబోతుంది అని స్పష్టం చేశారు. స్పైడర్ మాన్.. డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలలో ఉండే హీరో స్టాఫ్ తో “కేజిఎఫ్ 3″… తీయబోతున్నట్లు నిర్మాత తెలియజేశారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఫోకస్ మొత్తం ప్రభాస్ “సలార్” పై ఉందని..35% షూటింగ్ కంప్లీట్ అయింది అని నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారం నుండి స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ మాసం కల్లా పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్ 3” పై దృష్టి పెట్టి 2024 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు..కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిర్గందూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


Share

Related posts

మ‌రో నిజ ప్రేమ ఘ‌ట‌నా చిత్రం

Siva Prasad

Ashu Reddy Latest Wallpapers

Gallery Desk

Puri jagannath: ‘జనగణమన’ స్టోరి లైన్ లీక్..అందుకే మహేశ్ రిజెక్ట్ చేశాడా..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar