25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: వాయిదా పడ్డ కొరటాల ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం..?

Share

NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండటంతో అభిమానులలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని అంటున్నారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించారు.

Koratala NTR movie opening program postponed

దాన్ని దృష్టిలో పెట్టుకొని తన కెరీర్లో 30వ సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి మూవీ ఓపెనింగ్ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తారీఖు అని అనుకున్నారు. కానీ తారకరత్న మరణించడంతో… ఈ సినిమా మూవీ ఓపెనింగ్ కార్యక్రమం వాయిదా వేసినట్టు సమాచారం. మరోసారి కొత్త తేదీని సినిమా యూనిట్ త్వరలో ప్రకటించనుందట. ఇదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోతున్న “NBK 108” షూటింగ్ కూడా వాయిదా వేశారట. ఇదిలా ఉంటే కొరటాలతో చేయబోయే సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Koratala NTR movie opening program postponed

సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ విషయం బయట పెట్టాలని.. మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. గతంలో రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా చేసిన తర్వాత వరుస పెట్టి ప్లాపులు పడ్డాయి. అయితే ఇప్పుడు తన 30వ సినిమాలో అటువంటి పొరపాటు జరగకుండా.. తారక్.. కొరటాల సినిమాని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Share

Related posts

మెగాస్టార్ బర్త్ డేకి ఒకరోజు ముందే బోలా శంకర్ అప్ డేట్..!!

sekhar

Ram Charan: మరోసారి రామ్ చరణ్ తో టాప్ డైరెక్టర్..!!

sekhar

పెళ్లి పేరుతో రెండేళ్లుగా అత్యాచారం చేసిన ఓ డైరెక్ట‌ర్.. టీవీ న‌టి ఆరోప‌ణ‌తో వెలుగులోకి..

Teja