సినిమా

NTR 30: ఆచార్య ఎఫెక్ట్‌.. `ఎన్టీఆర్ 30` విష‌యంలో కొర‌టాల కీల‌క నిర్ణ‌యం!?

Share

NTR 30: కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన చిత్రం `ఆచార్య‌`. నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 29న విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ప్రేక్ష‌కులే కాదు అభిమానుల అంచ‌నాల‌ను ఈ చిత్రం అందుకోలేక‌పోయింది.

దీంతో వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్న కొర‌టాల శివకు ఆచార్య రూపంలో భారీ ఫ్లాప్ వ‌చ్చి ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే కొర‌టాల త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌లో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌బోతున్నారు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో మ‌రి కొద్ది రోజుల్లో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అయితే ఆచార్య రిజ‌ల్ట్ ఎఫెక్ట్ తో కొర‌టాల `ఎన్టీఆర్ 30` స్ట్రోరీ మ‌రియు స్క్రిప్ట్‌పై మ‌రోసారి వ‌ర్క్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

క‌థ‌, క‌థ‌నంలో ఎటువంటి లోపాలు లేకుండా ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇందుకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని, ఎంత టైమ్ కావాలంటే అంత టైమ్ తీసుకోమ‌ని ఆయ‌న చెప్పార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.


Share

Related posts

ఫ్యాన్ వార్‌.. ఒక‌రికి తీవ్ర గాయాలు..

Siva Prasad

మ‌హ‌ర్షి వాయిదా?

Siva Prasad

Athulya Ravi Holi Images

Gallery Desk