Bheemla nayak: తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరు హీరోలుగా కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సినిమా రీమేక్ ..ఇది ఎలా ఉంటుందో అని కొందరు సందేహాలను వ్యక్తపరిచిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, అలాంటి వారి సందేహాలన్నీ నిన్నటితో తీరిపోయాయి. మొదటి షో నుంచే విడుదలైన అన్నీ చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను దక్కించుకుంది.
అంతేకాదు, పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా సినిమాను, ఇందులో నటించిన పవన్ కళ్యాణ్ – రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుగుణగా నటించిన నిత్యా మీనన్ కూడా బాగా ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నితిన్, మంచు మనోజ్, దర్శకులు హరీశ్ శంకర్, క్రిష్ సహా పలువురు సినిమాను మెచ్చుకుంటున్నారు. వసూళ్ళ పరంగా పవన్ కళ్యాణ్ – రానాల భీమ్లా నాయక్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.
Bheemla nayak: నిజమైన పవర్ స్ట్రామ్ అంటూ చిరంజీవి ట్వీట్..!
ఈ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ – రానాలతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కామెంట్ పెట్టారు. భీమ్లా నాయక్ అండ్ డేనియల్ శేఖర్ లతో చిరు ఉన్న ఫోటోను షేర్ చేసి ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు. నిజమైన పవర్ స్ట్రామ్ అంటూ.. చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. చిరంజీవి – పవన్ కళ్యాణ్‌లకు సంబంధించిన వీడియో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు ముందు రామ్ చరణ్ ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ అవడంతో చిరంజీవి కంగ్రాట్స్ చెప్పడం మెగా అభిమానులను మాత్రమే కాక అందరినీ సర్ప్రైజ్ చేసింది.