Samantha Nagarjuna: అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ… మరోపక్క గ్లామర్ రోల్ సినిమాలు కూడా చేస్తూ చేతినిండా సినిమాలతో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా సమంత సత్తా చాటుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంత పలు సినిమాలు చేస్తూ ఉంది. పుష్పలో ఐటెం సాంగ్ ఊ అంటావా.. అనే పాటలో సమంత హవా భావాలు స్టెప్పులు… ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తెలిసిందే.
ఇక ఇదే సమయంలో మరో పక్క నాగచైతన్య కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి జీవితం బాగుండాలని.. సమంతతో మళ్లీ దాంపత్య జీవితం కొనసాగించేలా నాగార్జున నేరుగా సమంత తండ్రితో ఇటీవల మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సమంత అంటే నాగార్జునకి ప్రత్యేకమైన అభిమానం. నాగార్జున అంటే కూడా సమంతాకి ఇష్టమే. అక్కినేని ఫ్యామిలీ తో చాలా అత్యంత సన్నిహితంగా ఉండే సమంత.. ఏ కారణంతో ప్రేమించి పెళ్లాడిన నాగచైతన్యకి విడాకులు ఇచ్చింది అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.
నాగ చైతన్య విడాకులకు సంబంధించి కూడా నాగార్జున.. తనకి కూడా అర్థం కాలేదు అని జవాబు కొన్ని సందర్భాలలో ఇవ్వటం జరిగింది. అంతమాత్రమే కాదు వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం చెప్పిన సమయంలో విడిపోకుండా పెద్ద పెద్ద వాళ్ళ చేత కౌన్సెలింగ్ కూడా అప్పట్లో నాగార్జున ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని నాగార్జున తన వంతుగా మళ్లీ ఇప్పుడు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తాజాగా సమంత తన తండ్రితో ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా సినిమా చేస్తూ ఉండే ఇది ఆగస్ట్ 12 వ తారీకు రిలీజ్ అవుతోంది. మరోపక్క నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా “లాల్ సింగ్ చద్దా” కూడా ఆగస్ట్ నెలలో ఒక్క రోజు వ్యవధిలో 13వ తారీకు రిలీజ్ కానుంది. అమెరికన్ తో పాటు నాగచైతన్య ఈ సినిమాలో నటించారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…